Others

అర్ధనారీశ్వర లాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమి శాంభవలీల ఏమానంద రసహేల
అడుగడుగునా సాగే బ్రహ్మానంద రసదోట
రజిత శ్రేణుల లోన కైలాస శిఖరాన
తద్ధిమిత తకధిమిత త్రిపుట తాళములోన
ఆ శివుడు ఆడేటి దివ్యానంద సుమభరిత
శృంగార రసహేల

శరదిందు శరశ్చంద్రికా తుషార లాహిరిలోన
భువనమంతా తపిసి అమృతమే జారగా
శివుని శిరమున నుండి అలలు అలలుగారేగి
ఆ గంగయే దిగి అవినినే చుంబించగా

గిరులు, తరులు, తలలూపగా
పూల ఝరులే కురిసి
బ్రహ్మాండవాహిని రసరాజ్యమే ఏలగా
ఆ కాలనాగిని క్షణముపాటువ ఆగి సయ్యాటలే ఆడగా
ఆ వసంత యామినులే ఇల వచ్చి
ఆ నందమున తేలి
మకరందమే కురియగా

ఆకాశ మార్గములో శుక పిక మయూర
పీయూషములు
ఆకలిదప్పులనే విడచి తమ
ఉనికినే మరిచి
రెప్పలే వాల్చక ఇచ్చెరువులో చూడ
ఆ నంది, ఆ భృంగి
ఆ ప్రమధ గణములే
తాళగతులే వేసి స్వరజతులు పాడా

భ్రమరములు మిణుగురులు
మధువములు
ఆ తూనీగ సమూహములు
ఆ నీలి మేఘములు
ఆ మలయ సమీరములు
ఆ సంద్రవాహినులు
జయజయా ఘోషలతో గుంపులు
గుంపులై
వరుస క్రమమున నిల్వ

గిరి రాజ నందిని ఆనంద నందినియై
సచ్చిదానందినియై అనురాగ వాహినియై
అద్యాంతరవళియై ఝం తకఝం
త్తఝణత తకఝణత

దిమి కిటల వాహినియై శతకోటి
మువ్వల అలారారు శబ్దమై
అందాల రాశియై శృంగార మూర్తియై
వేదాంత వేద్యమై
సృష్టికే ప్రతిసృష్టియై శతకోటి దీపమై
శివునిలో ఏకమై
శివాత్మకమై నిలచి మృదంగ రాళాల
పదగతులే పాడగా
వయ్యారముగా ఆ శివాని అల్లనల్లన ఆడగా
కైలాసశిఖరాన ఆనందమే విరిసి
ఈ భూతలమే ఒక పూలనావగ మారి
ప్రతి ఒక్కరి మనసులలో అజ్ఞానమే పోయి
జ్ఞాన జ్యోతులే వెలుగగా

అర్థనారీశ్వరము అమిత సుందరమనుచు
మునివరులు, సురవరులు కినె్నర
కింపురుషులు పాతాళ వాసులు స్తుతియించి
కీర్తించి తమ తలలు వాల్చగా గానమే జేయగా

ఈ విశ్వమంతా పూల దొంతరులుగా దొర్లి
పూల వర్షమే కురియగా ఆ పిల్ల తెమ్మెరెలు
మంచు బిందువులతో కలసి, ముత్యములై
మెరసి చామరలే వీయగా
కైలాసమే మారె రసరమ్యమోహినిగా
నవ జీవన వేణువుగా ఆనంద హేలగా
అనురాగ డోలగా...

- కే.జి. దేవి