Others

కైలాసవాసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యూష సమయాన పరమ శివా!
కైలాసవాసా అర్థనారీశ్వరా
నటనాగ్రేసరా నాట్యకారా
లయకారా నందిభృంగీ సమేతుడా
భవానితో భవుడు భద్రమయ్యా
భావనాతీతా భవ్యచరితా
శివశంభో శివశంభో
హర హర శంభో శంభో
బ్రహ్మవిష్ణువుల అహంకారంబాపి
లింగాకారుని వి వైనావు
మృకండుమనస్వినులకు
మార్కండేయునొసంగి
అపారకృపానిధి వైనావు
ముల్లోకాలను ముట్టడించే
త్రిపురాసురుని జంపి
త్రిపురారి వైనావు
హాలాహలం గరళాన్ని
నీలకంఠుని వైనావు
జగ్గజేత గా నిలిచినావు
పరమశివా పరమశివా
నోరార పిలిస్తే ఓ అని పలికే
పరమశివ ప్రత్యూష సమయాన
పరమానంద పార్వతితోడి పరమశివా

- శివ ప్రసన్న