Others

భ్రాంత చిత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మహిళాభ్యున్నతి కారకా!
ఓ నవభారత నిర్మాతా!
ఓ అనాథరక్షకా!
ఓ ఆలోచనా తత్పరా... !
నీవు సౌందర్యారాధకుడవని
భ్రమిస్తున్నావా...
ధవళకాంతివనవిహారం
చేయాలనేది నీది ఉత్సుకతా...
నీ ఎదరొదలో వేదనా గానాలా...
చిమ్మచీకట్లా.... మధురగీతులా..
ఏవి ఎందున్నాయ...

ఓ రావణ కీఛక వంశీయుడా....
నీలో ఉన్నది నిశాంధకార నిర్నీతి
నీలో అస్కన్నము కావాలి తేజోరాశి
నికనైన వదిలించు
మలిన ఆలోచనా పరంపర
ఉంకించు నిక శే్వతాంబరవీధిన
మలినభాష్పాల నొప్పారలేదెన్నడీ జగతి
శే్వతాంబరవినువీధిలో తెలివేకువ పడతి
ఆలపించే సుమధుర గీతిలోగడిపేను
ఈ జగమెల్లప్పుడును

నెనరున్యాయం వీడి
అర్థం పర్థంలేని పదాలపోహళింపుతో
కవిత్వమనే కలికితురాయని
మసిబారనీయకు
చెలిమికి అర్థం తెలియని మూర్ఖశిఖామణీ
చెలికాడు లేని పడతల్లా
మందభాగ్యాల రాశికాదోయ
తళుకుబెళుకులనతికించి
మ్రోడుమ్రాకుల వెలగించి మురసిపోవ

సీతాకోకచిలుకవై
మధురాన్ని ఆస్వాదిస్తానంటే
దానికీ ఓ నియమం ఉంటుంది.
భ్రమరమై భ్రమరగీతలు ఆలపించ
నీదు వైదుష్యం చూచి
నలుగురు మెచ్చవచ్చు
కాని నీలోని స్వార్థం
నినే్న వెక్కిరిస్తుందోయ వెర్రినాగన్న....
మనసు చెప్పింది
విను....... మర్మంలేకుండా మాట్లాడు
స్వార్థుడై ప్రేమ అనే
చెకుముకి రాయ ని ధరించి
ప్రకృతినే చెక్కుతానంటే
ప్రణయమే ప్రళయరాగాన్ని
చిందిస్తుంది జాగ్రత్త

నీదు ఆలోచనసరళి
ఈవిధంగా నే నున్నట్టి వేళ
ఏ సుదతినీ కాంచలేవు.....
నీచిత్త శాంతికై పలికించు
నీనోట భగవానుని నామగీతి
ఇదియే నీకు ఆత్మశాంతి
ఇంకా నా ఇకపై సాగదు
నీ భ్రాంతచిత్తము
కట్టిపడవేయ మనసును
అపుడన్నా నీకుచేకూరును చిత్తశాంతి

- ప్రసన్నాంజలి