Others

మహోదాత్తుడు చెర్విరాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.యక్షగాన కవి, 2. చిరుతల నాట్య గ్రంథ రచయిత, 3. వేదాంత కవి, 4. జానపదత్వం ఉన్న ప్రజాకవి, 5. బుఱ్ఱకథల రచయిత, 6. బ్రతుకమ్మ పాటల రచయిత, 7. మంత్ర తంత్ర గ్రంథాల రచయిత, 8. దేశభక్తి గీతాల రచయిత 9. శతక రచయిత 10. అనువాద గ్రంథ కర్త 11.్భజన కీర్తనల రచయిత, 12. నవలా రచయిత , 13. ఉద్యమ గీతాల నిర్మాత , 14.గ్రంథ పరిష్కర్తగా అందరికీ సుపరిచితులైన చెర్విరాల భాగయ్య స్వాతంత్య్రోద్యమంలో ముందంజ వేసి భారత జాతీయ నిర్మాణానికి కారకులైన నేతాజీ పైన భాగయ్య బతుకమ్మ పాటలు వ్రాశాడు. తెలంగాణలో స్ర్తి బాల వృద్ధ జనమంతా ఆ కాలంలో ఈ పాటల్ని పాడుకొన్నది. జాతీయోద్యమాన్ని రగిలించే ‘‘వీర ధవళ’’ అనే మరాఠి నవలను భాగయ్య తెనిగించారు. అది రెండు భాగాలుగా అచ్చయ్యింది.
ఆనాడు ఛత్రపతి శివాజీనే హైందవ మహావీరునిగా తీర్చిదిద్దిన సమర్థ రామదాసు ‘‘దాసబోధ’’ నాలుగు వందల పుటల గ్రంథంగా తెలుగులోకి మొదటిసారిగా తెచ్చిన ఘనత భాగయ్యకే దక్కింది.
చెర్విరాల భాగయ్య 1908 లో జన్మించారు. ఆయన తల్లి రాజమ్మ, తండ్రి వీరయ్య, ఆయనకో అక్క తమ్ముడు చెల్లెలూ ఉన్నారు. వీరిది స్వస్థలం హైదరాబాదులోని మశూరాబాదు. తండ్రి వీరయ్య భాగయ్యకు 4 సం॥ ఉన్నప్పుడే అక్షరాలు వాక్యాలు దిద్దించి కంచర గోపన్న పాటలు నేర్పించాడు. దాశరథీ శతకంలోని పద్యాలు పాడించాడు. 7సం॥ వయస్సులో తండ్రి పోవడం ఆ కుటుంబానికి ఆశనిపాతం. కాని ఎదురవుతున్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ తెలుగు నేలకు, తెలుగు భాషకు ఎన లేని సేవ చేసిన మహోదాత్తుడు చెర్విరాల భాగయ్యకవి.