Others

ఆమె నవ్వింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైదేహి: హలో! చూడండి!
......
హల్లో! మిమ్మల్నే!
యువకుడు: (ఉలిక్కిపడ్డట్టు) ఆ.. పిలిచిరా అమ్మా!
వైదేహి: మరే, కాస్త ఆ కిటికీతలుపు వేసేస్తారా? చలిగాలి ఎక్కువగా ఉంది. బొగ్గు రవ్వలు కూడా పడుతున్నాయి.
యు: తప్పకుండా.
వై: మీ పేరేమిటన్నారు?
యు: నా పేరా? రామారావు.
వై: చాలా మామూలు పేరు.
రామా: అవునండి. నేనూ అలా మామూలు మనిషినే.
వై: ఏమిటి- కిటికీలోంచి అలా చూస్తున్నారు?
రా: ఆకాశంలో సప్తర్షి మండలాన్ని!
వై: (నవ్వుతూ) కొత్తగా పెళ్ళయ్యిందా!
రా: మీరెపుడైనా నక్షత్రాలకేసి అలా చూస్తూ వుంటారా?
వై: లేదు. నా చూపెప్పుడూ భూమీదే ఉంటుంది.
రా: నక్షత్రాలని చూస్తే నాకెంతో ఓదార్పు కలుగుతుంది.
వై: ఏం? మనుషులు ఓదార్పు పనికిరాదా?
రా: పనికిరాక కాదు. ఓదార్చే మనుషులెవరూ లేక. నాకున్నవాళ్ళంతా ఏడ్పించేవాళ్ళే.
వై: ఎవళ్ళో ఏడిపిస్తే మీరు ఏడ్చెయ్యడం దేనికి? మీరే వాళ్ళని తిరిగి ఏడిపించలేరూ?
రా: చాతకాదు. నాకెంకో మనుషుల్ని చూస్తే భయం.
వై: (నవ్వుతూ) మిమ్మల్ని చూసి మా నాన్న జేబుదొంగ అన్నాడు. గొంతుక అంత హీనస్వరంలో ఉందేం? భోజనం చెయ్యలేదా? పూరీలున్నాయి, ఇస్తానుండండి.
రా: అవసరం లేదులెండి. నాకేమీ తినాలని లేదు. ఆకలి కడుపు నాకలవాటే.
వై: ఫరవాలేదు, తీసుకోండి. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర కూడా సరిగ్గా పనిచెయ్యదు.
రా: పోనీ ఇవ్వండి. నేను తిండి లేకుండా ఇలా కృశించి చచ్చిపోతే మా కమల పిన్నికి సంతోషంగా ఉంటుంది గాని.
వై: కమలపిన్నా? ఆవిడెవరు?
రా: ఎందుకులెండి! మీ నాన్నగారు చెప్పినట్లు అదంతా పెద్ద సోది.
వై: ఫరవాలేదు చెప్పండి. కాసేపు కాలక్షేపం. ఎలాగ నిద్ర రావడంలేదు. తీసుకోండి. ఆ పూరీలు! అవిగో మంచినీళ్ళు!
రా: తీసుకుంటా. మా కమలపిన్ని ఎవరన్నారు కదూ! ఎవరేమిటి? నన్ను పెంచి పెద్ద చేసిన దయామయి. చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు నాకు. పినతండ్రి ఇంట్లో పెరిగాను. ఎంత ముచ్చటగా అనుకున్నారు? వినండి.
కమల: ఒరేయ్ రామం లాంతర్లన్నీ తుడిచి కిరసనాయిలు పోశావా?
రామం: పోశాను పిన్నీ!
కమల: డాబామీద ఆరేసిన బట్టలన్నీ మడిచి గదిలో పెట్టావా?
రామం: పెట్టాను పిన్నీ! పరువులు కూడా చుట్టబెట్టి లోపల పెట్టాను
కమల: సరే. గంగాళాలన్నింటిలనూ నీళ్ళు తోడి పొయ్యి.
రామం: పోసేశాను పిన్నీ!
కమల: ఎందుకురా అలా గుర్రం మీదున్నట్టు మాట్లాడుతావ్! మళ్ళీ ఏదైనా బాబయ్యగారితో చెపితే కుళ్లి కుళ్ళి ఏడుస్తావ్?
రామం: ఇప్పుడు నేనేవన్నాను పిన్నీ?
కమల: ఏడిశావ్‌లే- వెధవ మొహం నువ్వునూ! కాంతంగారింటికి వెళ్లి రెండు కరివేపాకు రెమ్మలు కోసుకురా.
రామం: రేపటి పాఠాలు చదువుకోవాలి పిన్నీ!
కమల: (కోపంగా) చదివావులేరా! బోడి చదువూ! వెళ్లిరా ముందు.
***
రామం: పిన్నీ!
కమల: ఏం నాయనా, ఏం? ఆకలేస్తోందా, ఏవైనా పెట్టమంటావు. అంతేనా?

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)