Others

చైతన్య శక్తి - మనోశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస’
జ్ఞానం అంటే మాట మీద ధ్యాస
ధ్యానం ద్వారా జ్ఞానం! జ్ఞానం ద్వారా ముక్తి! అన్నారు బ్రహ్మర్షి ప్రతీజీ. చెయ్యవలసింది చేస్తే రావలసినది అదే వస్తుంది. చేయవలసింది ధ్యానం! తద్వారా పొందేది ఆత్మజ్ఞానం!
ధ్యానం ఎందుకు? అది వృద్ధాప్యంలో చేయవలసింది కదా అని చాలామంది అనుకోవడం చూస్తూనే ఉంటాం. ధ్యానం ద్వారా మనోశక్తి ప్రబలమవుతుంది. మనోశక్తి ద్వారా ప్రావీణ్యత ప్రబలమవుతుంది. ‘యోగస్థః కురుకర్మాణీ! యోగః కర్మసు కౌశలం’ అన్నారు శ్రీకృష్ణుల వారు. యోగం అంటే కలయిక. యోగం అంటే ధ్యానయోగం. ధ్యానయోగివై నీ బాధ్యతలను నిర్వర్తించు అర్జునా! ధ్యాన యోగం వల్ల చేసే కర్మల్లో నైపుణ్యం లభిస్తుంది అన్నారు భగవాన్ శ్రీకృష్ణ. ధ్యానం అన్ని వయస్సుల వారికీ అవసరం!
మనిషి తనకున్న శక్తిసామర్థ్యాలను సంపూర్తిగా వినియోగంలోకి తీసుకుని రావడానికి మనోశక్తిని వినియోగించుకోవలసి ఉంది. మరి ఈ మనోశక్తిని అంతఃశక్తి నుండి ‘్ధ్యనం’ ద్వారా సంపాదించుకోవలసి ఉంది.
ఇంటలిజెన్స్, అవగాహనా శక్తి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సూక్ష్మబుద్ధి గ్రాహ్యత, ఏకసంథాగ్రాహ్యత.. ఇవన్నీ మనోశక్తి నుండి ఉద్భవించే ఉప ఉత్పత్తులు. (బై ప్రొడక్ట్స్)
ధ్యానం - మనోశక్తి - ప్రావీణ్యత (స్కిల్) ఉన్నతమైన తెలివితేటలు (హైయ్యర్ ఇంటెలిజెన్స్) అనేవి మన అంతరంగంలో నుండి ఉద్భవించాల్సి ఉంది. ఉన్నతమైన చైతన్య శక్తిగల వ్యక్తికి (హైయ్యర్ కాన్షియస్‌నెస్) ఉన్నతమైన మనోశక్తి (మైండ్ పవర్) ఉంటుంది.
మనోశక్తి ప్రబలం కావడంవల్ల మానవుని గుణాలు ఉన్నతంగా అభివృద్ధి చెందుతాయి.
వాల్మీకి మహర్షి - వేటగాడి స్థాయి నుండి (తమోగుణం) ధ్యాన సాధన ద్వారా యోగి స్థాయికి (నిర్గుణ స్థాయికి) చేరుకోగలిగాడు. మన ఋషులు, యోగులు అనాది కాలంలోనే లక్షల సంవత్సరాల నుండే ధ్యానం యొక్క విశిష్టతను గుర్తించారు.
ఇవాళ మన శాస్తవ్రేత్తలు కూడా ధ్యానం వలన కలిగే లాభాలను శాస్ర్తియంగా రుజువు చేయగలుగుతున్నారు.
ధ్యానం ద్వారా విశ్వశక్తిని (కాస్మిక్ ఎనర్జీ), ప్రాణశక్తిని (లైఫ్ ఎనర్జీ) తీసుకోవడం జరుగుతుంది. ధ్యానం ద్వారా విశ్వశక్తి + ప్రాణశక్తి - ఈ రెండూ రూపాంతరం చెంది మనోశక్తి (మైండ్ పవర్)గా మార్పు చెందుతూ ఉంటుంది. మనిషి యొక్క ఇంటెలిజెన్స్‌ను పెంచే ఏకైక మార్గం ధ్యానం.
ధ్యానం
సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా విశ్వశక్తి + ప్రాణశక్తిని తీసుకుంటున్నాం. ధ్యానం చేయడం వల్ల (శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల) ఆలోచనా రహిత స్థితికి చేరుకోవడం ద్వారా మరి అనేక రెట్లు విశ్వశక్తి + ప్రాణశక్తిని తీసుకోవడం అనేది అనేక రెట్లు వేగవంతం అవుతుంది.
ధ్యానం ద్వారా విశ్వశక్తి + ప్రాణశక్తి వేగవంతం అవడం వల్ల మనోశక్తి ప్రబలమవుతుందని చెప్పుకున్నాం కదా. ధ్యాన సాధన + ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానం ద్వారా మానవ జాతి యొక్క చైతన్య శక్తి గణనీయంగా పెరుగుతుంది.
చైతన్య శక్తి
ఆధ్యాత్మిక రహస్యాలను, జీవిత సత్యాలను, ధర్మ సూక్ష్మాలను గ్రహించడానికి మానవ చైతన్య శక్తి అధిక మోతాదులో ఉండాలి. అప్పుడే మనో శక్తి ప్రబలంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ - ప్రవచించిన ఆధ్యాత్మిక సత్యాలను సంపూర్ణంగా అర్థం చేసుకునే స్థితిలో ఇవాళ మానవ ఇంటెలిజెన్స్ లేదు. మానవ జాతి ధ్యానం ద్వారా తమ చైతన్య శక్తిని ఇతోధికంగా పెంచుకోవడం ద్వారా, ఆ యోగీశ్వరులు చెప్పిన అఖండ సత్యాలను అర్థం చేసుకోగల మనోశక్తిని సాధించుకోగలరు.
ధ్యానం ద్వారా విశ్వశక్తి + ప్రాణశక్తి + మనోశక్తి.
ఇంటెలిజెన్స్ అనేది మనిషి కలిగి ఉంటున్న చైతన్య శక్తి స్థాయికి అనుగుణంగా ఉంటుంది. ఎక్కువ చైతన్య శక్తిని కలిగిన వ్యక్తి ఎక్కువ ఇంటెలిజెన్స్‌ను కలిగి ఉండటం జరుగుతుంది.
బుద్ధిమాంద్యం పోగొట్టగల ఏకైక మార్గం ధ్యానం.
(బ్రహ్మర్షి ప్రతీజీ యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాల సంకలనం)

-మారం శివప్రసాద్