Others

నల్లగొండ మాణిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుకవి జీవించు ప్రజల నాలుకయందు అన్న జాషువా మాటలే నేడు నిజాలయ్యాయి అనిపించేది గంగుల సాయిరెడ్డి జీవిత చరిత్ర. ఈ కవి సాధారణ మధ్యతరగతికి చెందిన కర్షకుని బిడ్డ. ఇతని జీవనోపాధి వ్యవసాయం. ఇతని ప్రవృతి సాహితీ వ్యవసాయం. రెండువేపులా కత్తికి పదునున్నట్టుగానే సాయిరెడ్డి అటు వ్యవసాయం చేసి పలువురికి అన్నం పెట్టిన చేత్తోనే నలుగురికి పాఠాలు చెప్పిన భవ్యజీవి అతడు. మనిషికి కండతో పాటు జ్ఞానం ఉండాలని ఆ జ్ఞానోపార్జనకు అక్షరమే మార్గమని తలిచాడు. తాను నివసించిన ఊరిలో విద్యార్థులను పిలుచుకువచ్చి విద్యను బోధించేవాడు. తానే అక్షరాలను నేర్పేందుకు తెలుగు వాచకాలు రచించి, పంచాడు. తానే రైతు కనుక రైతు కష్టసుఖాలను కళ్లకు కట్టినట్టు కాపుబిడ్డ అనే కావ్యాన్ని రచించాడు. ఆ కాపుబిడ్డ చదివిన వారికి కడుపు చెరవౌతుంది. అంతేకాక వర్షయోగం అనేకావ్యాన్ని రైతుకు పనికి వచ్చేవర్షధార గురించిన సమాచారాన్ని వివిధ శాస్త్రాలను తాను స్వయంగా మధించి మరీ రచించారు. నాటి జానపదులు వైద్యులకు ఆమడదూరంలో ఉండేవారు. వారికి అనువుగా ఉండాలని తాను పూర్వీకుల నుంచి గ్రహించిన, తెలుసుకొన్న విషయాలను ఆరోగ్యరహస్యం అన్న పేరిట రచించి, పంచారు. ఎన్నోపుస్తకాలు రచించి తన స్వంత డబ్బుతో అచ్చువేయించి ప్రతిఫలం ఆశించకుండా పంచిపెట్టిన సాయిరెడ్డికేవలం రచనలే కాదు సామాజిక సేవను కూడా అందించారు. పశువుల దాహార్తిని తీర్చడానికి నీళ్లతొట్టెలను, వాటి కండూతిని పోగొట్టుకోవడానికి రాతి గుంజలను అడవుల్లో పెట్టించిన సాయిరెడ్డి జీవకారుణ్యసేవ ఇంత అని చెప్పడానికి వీలులేనిది. నల్లగొండ మాణిక్యం అని ప్రజలు చెబుతున్నారు. కాని ఆయన గురించి వివరాలు ఎక్కడా నమోదుకాలేదు. కనీసం ఆయన రచనలూ నేడు లభ్యం కావడం లేదు. కొండాలక్ష్మీకాంతారెడ్డిగారు పూనుకొని ఒక్క కాపుబిడ్డను మాత్రం కవి వరేణ్యుల ద్వారా పరిష్కరింపచేసి ముద్రించారు. ఇటువంటి తెలంగాణా కీర్తి కిరీటాలను భద్రపర్చాల్సిన అవసరం ఎంతో ఉంది.