Others

విమర్శలూ తీసుకోవాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది తమిళంలో ‘స్కెచ్’ చిత్రంతో తమన్నా అందర్నీ అలరించింది. తెలుగులోనూ ఇదే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు అరడజను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న తమన్నా నటిగా తన గురించి తాను చెబుతూ- ‘కథానాయికగా నా ఎంట్రీ బాలీవుడ్ చిత్రం ‘చాంద్ సా రోషన్ చెహ్రా’తో ప్రారంభమైంది. అప్పట్నుంచే బాలీవుడ్‌లో ఓ మంచి స్థానం కోసం ప్రయత్నిస్తున్నా. ఈ క్రమంలో నన్ను నేను తెలుసుకున్నా. అదంతా నాకు సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ వల్లే సాధ్యమైందని భావిస్తున్నా. నువ్వేంటనేది తెలియడానికి ప్యాషన్ గొప్ప మాద్యమం. కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్లడం, నచ్చిన దానికోసం హార్డ్‌వర్క్ చేయడం వల్లే మనమేంటో తెలుస్తుంది. ఈ విషయంలో విమర్శలు కీలక పాత్ర పోషిస్తాయి. విమర్శల వల్ల నా తప్పులను తెలుసుకుని నన్ను నేను బెటర్‌మెంట్ చేసుకున్నాను. కొన్ని సార్లు విమర్శ హార్ష్‌గా ఉండొచ్చు. కానీ నాకు మాత్రం అదే హెల్ప్ అయ్యింది. ఎన్నో విభిన్న పాత్రలు చేసేలా దోహదపడింది’ అని తెలిపింది.