Others

మనలోనే అన్నీ ఉన్నాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక శతాబ్దం క్రితం నాటి కాలంతో పోల్చుకుంటే మానవ జీవన ప్రమాణాల నేడు విశేషంగా మెరుగయ్యాయి. సంపదలు పెరుగుతున్నాయి. అనేక సౌఖ్యలకు అలవాటుపడుతున్నాము. విద్య, ఆరోగ్యపరంగా ఎన్నో నూతన ఎత్తులకు చేరుకుంటున్నాము. శారీరక శ్రమ అవసరం లేకుండా అనేక సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.
అయినా మనం తీవ్రమైన అశాంతిని, అలసటను, అసౌకర్యలను ఎదుర్కొంటున్నాము. ప్రశాంతత కోసం, సంతోషం కోసం ఎవ్వరెవ్వరి దగ్గరకో వెడుతున్నాము. స్థిరంగా ఏ విషయంపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాము. చంచల స్వభావంతో పోతున్నాము. ఒకవిధంగా జీవితమే గందరగోళ పరిస్థితులలో చిక్కుకొంటున్నది.
చిన్నచిన్న ఆటుపోట్లకు తట్టుకలేక విలవిలలాడుతున్నాము. మనలో ఒకరకంగా ప్రతికూల ధోరణులు తలెత్తుతున్నాయి. మంచి ఆహారం లభిస్తున్నా, ఎన్నో సంబరాల్లో పాల్గొంటున్నా, వినోదాలలో పాలుపంచుకొంటున్నా, ఖరీదైన జీవనం గడుపుతున్నా తీవ్రమైన వత్తిడులకు గురవుతున్నాము. ఇటువంటి పరిస్థితులకు కారణం మానవ విలువలు తరిగిపోతూ ఉండడం, మనలను మనం తెలుసుకోలేకపోవడమే అని అంటున్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంకు చెందిన షీలా అక్కయ్య.
హైదారాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజయోగ ద్వారా మనలో మానసిక వికాసానికి దోహదపడడంతో పాటు, ఉన్నతమైన జీవన విలువలను సమకూర్చుకొనే విధంగా సహకరిస్తూ, ప్రజలలో ఆ మేరకు చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్న ఆమె, ప్రస్తుత పరిస్థితులలో మనలో పెరుగుతుతున్న అశాంతికి దారితీస్తున్న పరిస్థితుల గురించి చర్చించారు.
రాజస్థాన్‌లోని వౌంటు అబూ కేంద్రంగా గల ఈ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థను ఆధ్యాత్మిక సాధనాల ద్వారా మనుషులు తమ గురించి తాము తెలుసుకొని, తమలోని దైవీయ శక్తులను గురించి, తమ జీవితాలను సంతోషమయం చేసుకొనే విధంగా సాధన చేసేటట్లు సహకరించేందుకు 1936లో ప్రారంభించారు. బ్రహ్మ బాబా ఎనిమిది మంది యువతులు ధర్మకర్తలుగా ప్రారంభించిన ఈ సంస్థ నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందితో వ్యాప్తి చెందింది.
అంతరంగికంగా మనలో వున్న శాంతి, సంతోషాలను మనం తెలుసుకోలేకపోవడం, తెలిసినా అనుభవంలోకి తెచ్చుకోలేకపోవడమే నేడు మనమంతా ఎదుర్కొంటున్న అశాంతికి, ఇతర సమస్యలకు కారణం అని అంటారు షీలా అక్కయ్య. ఎక్కడ ఉందో అక్కడ కాకుండా వేరే చోట అనే్వషణ చేస్తూ ఉండడం, మనలోనే ఉన్న స్వరూపాన్ని గుర్తించలేక బాహ్య ప్రపంచంలో వెతుక్కోవటం నేడు మానవ సమాజంలోని అన్ని రుగ్మతలకు కారణంగా భావిస్తున్నారు.
మనలో సహజసిద్ధంగా ఉన్న విశేషమైన శక్తీ స్వరూపాన్ని గ్రహించలేక, జీవన అనుభవంలోకి తెచ్చుకోలేక తీవ్రమైన అశాంతికి, అలసటకు గురవుతూ వున్నాము. ఎక్కడినుండో, మరెవ్వరో వచ్చి మన సమస్యలకు పరిష్కారాలు చూపుతారని ఎదురుచూడడంవల్ల ప్రయోజనం ఉండబోదని గ్రహించాలి. అసలు నేను ఎవరిని? సూర్యచంద్ర నక్షత్ర మండలం అవతల ఉండే నిరాకార స్వభావంగల ఆత్మలకు చెందిన, శాంతి లోకం నుండి వచ్చినవారమే. బ్రహ్మకుమారి ఈశ్వర విద్యాలయంలో ఆధ్యాత్మిక జ్ఞానం, రాజయోగ శిక్షణ ద్వారా మన మనసను ఆత్మలోకానికి చేరుకుని, మన లోపల నిబిడీకతమై ఉన్న శక్తిని గ్రహించేటట్లు చేయడానికి చోదకశక్తిగా వ్యవహరిస్తున్నారు.
పరమశివుడు ఆత్మలోకానికి తండ్రివంటివారు. జ్యోతిస్వరూపుడు. అందుకనే జ్యోతిర్లింగ స్వరూపంగా ఆరాధిస్తుంటాము. ఈ అనంత శక్తి స్వరూపుడే శాంతి, ప్రేమ, ఆనందం, శక్తి, దయ, జ్ఞానం.. సర్వగుణ సాగరుడితో మన మనసును లగ్నం చేసుకోవడం ద్వారా ఆ పరమేశ్వరునితో అనుబంధం ఏర్పర్చుకోగలమని అన్ని శాస్త్రాలు ధర్మాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆ విధంగా మన మనసును ఏకాగ్రం చేసుకోవడం ద్వారా మన అంతరంగిక సంకల్పం, నిర్ణయం, ప్రవర్తన, ఉద్వేగాలను నియంత్రించుకునే విధంగా రాజయోగ సహకరిస్తుంది. ఇటువంటి అభ్యాసం ద్వారా మనం మన సహజ సిద్ధమైన శక్తులను గ్రహించి సౌకర్యవంతంమైన స్థితికి చేరుకొంటాము. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులనైనా సులభంగా, ప్రశాంతంగా ఎదుర్కొనే మానసిక బలాన్ని సమకూర్చుకోగలుగుతాము.
అందుకనే మన మనసును మనం నియంత్రించుకోగలిగితే మన సమయాన్ని సామర్థ్యాన్ని మన అవసరం మేరకు ఉపయోగించుకోవడం ద్వారా మనలో ఉన్న విశేషమైన సామర్థ్యాలను అనుభవంలోకి తెచ్చుకోగలము. తద్వారా జీవితంలో శాంతి, ప్రశాంత, సంతోషం, ఆనందాలను సమృద్ధిగా పొందగలము. మానవ జీవనాన్ని సద్వినియోగం చేసుకోగలమని షీలా అక్కయ్య వివరించారు.

-చలసాని నరేంద్ర