Others

అంతటా కృష్ణనామమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓ భగవంతుడా నీవు మాప్రాణాలు తీసుకో అంతేకాని ఈ చిన్ని కృష్ణుని ప్రాణాలకు ఆపద రానివ్వకు. ఈ కాళీయుని విషజ్వాలలకు మా ప్రాణాన్ని బలిపెట్టకు. కృష్ణుడు లేకపోతే మేము లేము. ఓ కృష్ణా! ఎన్నో సార్లు మేము పలుకగానే నీవు ఓ అని పలికేవాడివి గదా. మరి ఇపుడు ఏమైంది నీవు అట్లా సోయ లేకుండా పడుకుని ఉన్నావే. ఒక్కసారి నీవు కనులు తెరిచి మా వైపు చూడు’’అంటూ పరిపరివిధాల భగవంతుడిని కోరుకుంటున్నారు. ఒక్కొక్కరు విధిని భగవంతుడిని కష్టాలు పెట్టాడని తిట్టుతున్నారు. మరొకరు ఎలాగైనా తమ ప్రాణాలకు ముప్పుకలిగినా మాకు అంత బాధలేదు గాని మాప్రాణం అయిన యశోదానందునునికి ఎగ్గు తల పెట్టవద్దని పదేపదే వేడుకున్నారు.
అందరూ పెద్దలు కలసి ఇంకఏమి లాభం కనిపించడం లేదు. ఏదైనా ఒక కర్ర తీసుకొని వచ్చి ఈ కాళీయుని తలపై మోది మన కిష్టయ్యను మనం కాపాడుకుందాం. కృష్ణుడే లేకపోతే ఇక మనలో ఎవరికి శ్వాస ఉంటుంది అని వారంతా ముందుకు కదులుతున్నారు. ఒక్కసారిగా అందరి గొంతుకలు మూగవోయినట్లు అందరి కళ్లల్లో కన్నీరు ఉబికి వచ్చింది. ఏడుస్తూనే కృష్ణుని పలుమార్లు పిలుస్తున్నారు.
బలరామా ఇది గో మీ తమ్ముడు విషానికి బలయ్యాడే. ఆనాడు పూతన విషానివ్వడానికి వస్తే ఆ పూతనే ప్రాణాలు కోల్పోయే ట్టు భగవంతుడు చేశాడు కదా. ఆ భగవంతుడు నేడు చూడడేమి కనడేమి అయ్యో గారాల పట్టీ నంద వ్రజ పాలకుడు, చిన్నివాడు, చిన్మయుడు అయిన ఆ నంద నందుడు లేవడేమి అని ఆక్రోసించారు.
బలరాముని కూడా భగవంతుని అంశయే కదా. కృష్ణుని శక్తి తెలిసిన వాడు కదా. అమాయకులైన యాదవుల భయం చూసి ‘‘తండ్రుల్లారా, తల్లులారా మీరు కాస్త ఓపిక పట్టండి. ఇంతలో ఆ భగవంతుని దయ వల్ల మన కృష్ణుడు కాళీయుని చెరనుంచి విముక్తుడవుతాడు. మనందరమూ ఆనందించే ఘడియ రానే వస్తుంది’ అని వారికి మంచి మాటలు చెప్పాడు వారిలో జారిపోతున్న ఆశను బతికించాడు.
అప్పటిదాకా ఏమీ తెలియని అమాయకునివలె, ఆ కాళీయుని విషానికి తలవొగ్గిన వాడికి మల్లె కృష్ణయ్య స్పృహను కోల్పోయినట్లు పడుకున్నాడు. వారంతా బాధపడడం చూసి అయ్యో నా కోసం ఎదురుచూసి ఎదురుచూసి వీర కండ్లు కాయలు కాచాయి. వీరు ఏడ్చి ఏడ్చి కళ్లల్లో నీరు ఇంకి పోయాయి. ఇక వీరు బాధపడితే నేను చూడలేను. ఎలాగైనా ఈ కాళీయుని దుష్టత్వాన్ని కాలరాయాలని నిశ్చయించుకున్నాడు.
ఇక్కడ గోకులమంతా పలుకుతున్న కృష్ణనామం విని కొండలు గుట్టలు చెట్లుచేమలు, ఆకులు పూవులు అసలు ప్రకృతి అంతా మైమరిచి కృష్ణా అన్న శబ్దాన్ని ఉచ్చరిస్తున్నదా అన్నట్టుగా కృష్ణనామం మారుమ్రోగిపోతోంది.
కాళీయుని చేత చిక్కిన కృష్ణయ్య చూసేసరికి గోపాంగన శరీరాలన్ని బరువెక్కిపోయాయి. వారి కళ్లు అదేపనిగా వర్షిస్తున్నాయి. గొంతులన్నీ తడారిపోయాయి. పెద్ద పెట్టున శోకిస్తున్నారు కాని వారి అరుపులు గొంతుల్లోనే ఇరుక్కుపోయాయి. వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. వారి కృష్ణా చిన్న నాన్న నిన్ను రక్షించు వారెవరూ ఆ గోపాలా మమ్ములను రక్షించువానివి నీవేనని అనుకొనేవాళ్లం. ఇపుడు ఈ దుష్టకాళీయుడు నిన్ను తన బాహువుల్లో ఇరికించుకున్నాడేమి. ఓ దేవాది దేవా మా తనయుణ్ణి మా నందవ్రజాన్ని కాపాడు అంటూ వేడుకుంటున్నారు.
వారు శరీరాలన్నీ కంపించుకుపోతున్నాయి. చిన్న పెద్దా తేడాలేదు. లింగ వివక్షత అసలే లేదు అందరూ ఏకాత్మలుగా వాసుదేవుని కీర్తిస్తున్నారు. వాసుదేవుణ్ణే ఎవరో రక్షిస్తారని ఎదురుచూస్తున్నారు.
అట్లాంటి అమాయకులను శ్రీకృష్ణుడు చూశాడు. ఆయన కన్నులు తడి చేరింది.
* * *