Others

మాటే మహామంత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎముక లేని నాలుక ఎదుటి వ్యక్తి ఎముకల్ని విరగ్గొడుతుంది’ అనంటారు పెద్దలు. ఇది మాటకున్న శక్తిని, బలాన్ని, విలువని, ప్రత్యేకతని తెలియజేస్తుంది
భగవంతుడు మనిషికి ఒకే పనిని చేసే పాదాలు, చేతులు, కళ్ళు, చెవులు రెండేసి ఇచ్చి రెండు పనులు చేసే నాలుకని ఒక్కటే ఇచ్చేడు. నాలుక రుచిని తెలియజేయటం, మాటలాడటం అనే రెండు పనుల్ని చేస్తుంది.
రెండు పనుల్ని చేసే నాలుక విషయంలో.. మనం చాలా జాగరూకతతో వుండాలి. ‘మాట’ అనేది భగవంతుడు మనిషిలో దాచి ఉంచిన దివ్యశక్తి. ఆ శక్తి అనంతమైనది. అంతులేనిది. ఆటంబాంబుకన్నా అతిశక్తివంతమైనది.
మాటకి ప్రాణం పోసే శక్తి ఉంది. ప్రాణం తీసే శక్తి కూడా ఉంది. అష్టకష్టాలతో, అనారోగ్యంతో, నిరాశా నిస్పృహలతో బాధపడుతున్నవానికి ఓ మంచి ఓదార్పు మాట ఎంతో ఉత్సహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. పరోక్షంగా అవతలివానికి ప్రాణం పోస్తుంది. అదేవిధంగా.. చక్కగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న వ్యక్తిని బాణంలా గుచ్చుకున్న పరుషమైన మాట, కఠినమైన, కర్కశమైన మాట, అవతలి వ్యక్తిని నిర్వీర్యుడ్ని చేస్తుంది. రోగగ్రస్తుణ్ణి చేస్తుంది. ప్రాణం పోయే స్థితిని, ప్రాణం తీసుకునే పరిస్థితిని తీసుకొస్తుంది.
అందుకే ‘వాక్కు‘కున్న శక్తిని అర్థం చేసుకోవాలి. అదుపులో ఉంచుకోవాలి. సద్వినియోగపరచుకోవాలి. సార్థకం చేసుకోవాలి.
మాట్లాడగలమని మాటాడే శక్తి ఉందని ఎదుటివాడ్ని గాయపరిచేటట్టు మాటాడకూడదు. ఔచిత్యం కోల్పోయి పరుషంగా కర్కశంగా మాటాలాడితే అది మహాపాపం అవుతుంది. తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
మాట అనేది ఎదుటివారిని ఒప్పించాలి. మెప్పించాలి. సామరస్యత పెంపొందాలి. సారస్వతాన్ని అందివ్వాలి. సమున్నతంగా ఉండాలి. సంతసాన్ని అందివ్వాలి. వివేకంతో కూడి ఉండాలి. వినయం, విజ్ఞాపనల కలబోతగా ఉండాలి. విచక్షణహితంగా ఉండాలి. విషయ పరిపక్వతగా ఉండాలి.
అయితే ఎక్కడ ఏ రకంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు అంత లోతుగా, సూటిగా ధాటిగా మాట్లాడకపోవడమూ కూడా తప్పే అవుతుంది. అనవసరమైన చోట అనవసరంగా వ్యర్థమైన పద్ధతిలో ఔచిత్యం లేకుండా మాట్లాడడమూ పెద్ద తప్పే!
మాట అనేది మన తీరుని, మన పథాన్ని, మన విధాన్ని విధానాన్ని మన స్థాయిని స్థానాన్ని స్వభావాన్ని, స్వరూపాన్ని ఖచ్చితంగా తెలియజేస్తుంది. చెప్పకనే చెబుతుంది.
ఓ చక్రవర్తి అరణానికి వేటకోసం మందీ మార్బలంతో వెళ్ళేడు. అరణ్యం లోపలికి బాగా వెళ్లిపోయేడు. తనతో వచ్చిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. దారి మళ్లిపోయేడు. దారి తెలియక అక్కడే వున్న ఓ అంధుడ్ని ‘‘నాయనా! ఈ వైపుగా ఎవరైనా వెళ్లినారా? నీకు ఏమైనా తెల్సా?’’ అని అడిగేడు. ‘తెలీదు’ అన్నాడు అంధుడు. కొంతసేపైన తర్వాత మంత్రిగారొచ్చేరు. ‘‘సోదరా! ఇటువైపు ఎవరైనా వచ్చేరా? అనడుగుతాడు మంత్రి. ‘లేదు’ అన్నాడు అంధుడు. మరికొంతసేపైన తర్వాత సేనానాయకుడు వచ్చేడు. ‘‘ఒరేయ్ మూర్ఖుడా! ఎవరైనా ఇటువైపు వచ్చేరా? గర్జించినట్లు గద్దించినట్టు అడిగేడు. ‘లేదు’ అన్నాడు అంధుడు. మరి కొంతసేపైనా తర్వాత ఓ సైనికుడొచ్చేడు. ‘‘ఒరేయ్ గుడ్డి వెధవా! ఈ దారిన ఎవరైనా వచ్చేరా?’’ అని అడిగేడు. ‘లేదన్నాడు’ అంధుడు. ఆఖరుగా ఆస్థాన పురోహితుడు వచ్చేడు. ‘‘తమ్ముడూ! ఇటువైపు ఎవరూ రాలేదా?’’ అని అడుగుతాడు.
అపుడు అందరూ వెళ్లిపోయిన తర్వాత ‘‘ఈ దారిలో మొదట రాజు, తర్వాత మంత్రి, ఆ తర్వాత సేనాపతి, తర్వాత సైనికుడు, ఆఖరుగా ఆస్థాన పురోహితుడు’’ వెళ్ళేరని చెప్పేడు.
అంధుడికి కళ్ళు లేవుగా. అతడెవరినీ చూడలేడు. అయినా వారెవరు అయ్యింది తెలీదు. కానీ అందరూ ఒకే ప్రశ్న వేసేరు. కానీ మాటలాడిన తీరు, ప్రశ్నించిన తీరు మాత్రం వేరుగా ఉంది. వారి మాటను బట్టి వారి స్వభావాన్ని, స్వరూపాన్ని వారి స్థాయిని స్థానాన్ని తెలుసుకున్నాడు, గుర్తెరిగాడు.
అందుకే ‘వాక్కు’ శక్తిని అర్థం చేసుకోవాలి. వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. మాటని సద్వినియోగపరచుకోవాలి. సార్థకం చేసుకోవాలి.
* * *