Others

దేశహితాన్ని కాంక్షించిన రామదాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్టల్రో 1608 సం.లో శ్రీరామనవమినాడు రామదాసు జన్మించాడు. ఈయన అసలు పేరు నారాయణుడు.బాల్యం నుంచే రామభక్తి గలవాడు. ఎనిమిదవ ఏట ఉపనయనం అయిన తర్వాత గాయత్రీ మంత్రంతో పాటు రామనామాన్ని కూడా తదేక దీక్షతో జపించాడు. వివాహ సమయంలో పురోహితులు చదువుతున్న మంత్రాల అర్ధాలను గ్రహించి భార్య తనకు బంధ కారణమని భావించాడు. వెంటనే అక్కడే ఆ బంధం నాకు అక్కర్లేదని చెప్పి తపోభూమికి తరలి పోయాడు. నాసిక్ సమీపంలో పనె్నండేళ్లు తపస్సు చేసాడు. నదిలో నిలబడి రామనామం జపించేవాడు. అపుడు రామసాక్షాత్కారం కలిగింది. అప్పటినుంచి రామదాసుగా ప్రశస్తిని పొందాడు. ఆ కాలంలో దేశం సాంఘికంగా, రాజకీయంగా, నైతికంగా, ధార్మికంగా అన్నివిధాలా పతనమైనట్లు భావించాడు. తన తపస్సు దేశోద్దారణకు ఉపయోగ పడాలనుకొన్నాడు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు సాగించాడు. ధార్మిక భారతదేశాన్ని నిర్మించడంలో విజయం సాధించారు.