Others

హావభావవిన్యాస ప్రకటనాధురీణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటులకు కేవలం నటనా సామర్థ్యం ఉంటే సరిపోదు. ఆ సామర్థ్యం తో ప్రేక్షకుల మనస్సును చైతన్యవంతం చేయవచ్చు. కానీ, నటనతో పాటుగా సామాజిక స్పృహ ఉండాలి. సమాజంలో జరిగే అవాంఛిత సంఘటనలను రూపుమాపే శక్తిసమన్వితులుగా ఉండాలనే చెప్పే బళ్ళారి రాఘవ తన నిజ జీవితాన్ని నటునిగా, న్యాయవాదిగా, రచయితగా, సంఘ సంస్కర్తగా, హరిజనోద్ధారకునిగా మలుచుకున్నాడు. ఒకవైపు ప్రాక్పశ్చిమ దేశాలలో అనితరసాధ్యమైన నటనను ప్రదర్శించి తెలుగువాడి కీర్తిబావుటాలను సగర్వంగా ఎగురవేసిన నటనావతంశుడు, హావభావవిన్యాస ప్రకటనాధురీణుడు పేరు తెచ్చుకున్నాడు. మరో పక్క హరిజన సేవచేస్తూ ఆపన్నులను ఆదుకునే సంస్కర్తగా పేర్గాంచాడు ఈ రాఘవనే. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1880 ఆగస్టు 2న జన్మించారు. నాటక కళలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, నాటక ప్రదర్శనల కోసమే ప్రత్యేకంగా నాటకశాలలను నిర్మించాలనీ, స్ర్తి పాత్రలను స్ర్తిలే ధరించాలనీ, రంగస్థల అలంకరణలో పాశ్చాత్య సాంకేతిక పద్ధతులను అవలంభించాలనే ఈ నాటక ధర్మాలకు శ్రీకారం చుట్టి నూతన మార్గానికి తలుపులు తెరిచారు.