Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మోత్సవం దెబ్బకు పెద్ద హీరోల సినిమాలన్నీ వెనక్కి తగ్గేసరికి ఈవారం సరైన సినిమాలు విడుదలకు వెనుకాడాయి. ఈవారం విశాల్ కథానాయకుడుగా ‘రాయుడు’, హాస్యనటులతో రూపొందించిన ‘వినోదం 100 శాతం’, హారర్ జోనర్‌లో
‘వసుధైక’తోపాటుగా మరో ‘టీనేజ్’ చిత్రం విడుదలయ్యాయి. రాయుడు చిత్రం పూర్తి తమిళ వాసనలతో తెలుగు ప్రజలకు నచ్చలేదు. వసుధైక మామూలుగా వచ్చే హారర్ జోనర్‌లో ఆకట్టుకోలేకపోయింది. వినోదం 100శాతం థియేటర్లు లేక విలవిలలాడుతోంది. టీనేజ్ గురించి చెప్పుకునే అవసరం లేదు. ఈ సినిమాలన్నీ బ్రహ్మోత్సవం వెనక్కి తగ్గడంతో కొద్దో గొప్పో కలెక్షన్లు రాబడుతున్నా, సుప్రీమ్, బిచ్చగాడు చిత్రాలు బ్రహ్మోత్సవం థియేటర్లు తగ్గడంతో ఆ థియేటర్లను ఆక్రమించాయి. బిచ్చగాడు దెబ్బకు బ్రహ్మోత్సవం విలవిలలాడుతోందని థియేటర్ల వద్ద
ప్రేక్షకులు జోకులేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వెలవెలబోతోంది.