Others

స్వామి భక్తి పరాయణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లంకాధీశుడు రావణుని మేనమామ మైరావణుడు. ఇతని అగ్రజుడు అహిరావణుడు. మైరావణుడు మాయాజాల వ్యూహరచనలో సిద్ధహస్తుడు. రామలక్ష్మణులను బంధించి తెస్తానని ప్రతిజ్ఞ చేశాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయస్వామి తన తోకను పెంచి సోదరులు వున్న ప్రాంతాన్ని ఒక దుర్బేద్యమైన కోటగా మార్చి పైన తానే కాపలాగా ఉంటూ ఎవరు ఎలా వస్తారనే ధైర్యంతో కాపలాగా ఉంటాడు.
మైరావణుడు విభీషణుని రూపంలో వచ్చి స్వామి దర్శనానికి అంటూ లోపలికి వెళ్లాడు. నిజమైన విభీషణుడే అని భావించిన ఆంజనేయస్వామి లోపలికి అనుమతించారు. అక్కడికక్కడే తన మాయాజాలంలో పాతాళానికి వాళ్లను తీసుకునిపోయాడు. ఆంజనేస్వామికి అసలు విషయం తెలిసింది.
మైరావణుని సంహరించాలని రామ లక్ష్మణుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎందుకంటే అతని ప్రాణం అతని శరీరంలో లేదు. ఎక్కడో ఏడు సముద్రాల అవతల ఒక పెద్ద మర్రి చెట్టులోని చిలకలో వాడి ప్రాణం ఉంది. ఆ చిలకను అక్కడ గొంతు పిసికితే ఇక్కడ వీడు చస్తాడు. ఈ రహస్యం ఎవరికీ తెలియదు ఒక్క చంద్రసేనకు తప్ప. ఆమె శ్రీరామచంద్రుని మోహించింది. ఆంజనేయస్వామికి ఈ విషయం తెలిసి ‘అమ్మా! ప్రాణ రహస్యం చెప్పండి’ అని అడుగుతాడు. చెబుతాను కాని ఒక నిబంధన అంటుందావిడ. ఏవిటి అన్న ఆంజనేయులవారి ప్రశ్నకు ‘రామచంద్రునితో ఒక సమాగము ఏర్పాటుచెయ్యాలి’ అంటుందావిడ. రహస్యం తెలుసుకున్న ఆంజనేయుడు ఏడు సముద్రాలు దాటి ఆ చిలుక గొంతు పిసకగానే ఇక్కడ మైరావణుడు మరణిస్తాడు. అపుడు చంద్రసేన నా షరతు తీర్చమంటుంది. స్వామి ఇపుడు ఒక ధర్మ సంకటంలో పడ్డారు. మాట తప్పడం తప్పు. మరి స్వామివారు ఏకపత్నీవ్రతుడు. ఈవిడతో శరీర సంబంధం ఎలా ఏర్పాటుచెయ్యడం అని ఆలోచించారు. స్వామివారికి చెప్పి ఆపద్ధర్మంగా ఇలా చేయవలసి వచ్చిందని, దీనిని ఎట్లా నేను మార్చగలను అని స్వామివారిని తీసుకొని వెడతారు. అక్కడ చంద్రసేన స్వామివారి సమాగమం కొరకు పట్టుపరువూ అన్నీ సిద్ధం చేస్తుంది. శ్రీరాములవారు ఆ పట్టె మంచంపై పడుకొంటాడు. ఆంజనేయస్వామి తన వ్యూహానికి పదునుపెట్టాడు. తాను ఒక పెద్ద చెదపురుగుగా మారి ఆ మంచపు కోళ్లను తొలుస్తుంది. మంచం విరిగిపోతుంది. స్వామివారు బయటపడతారు. ఈ విధంగా ఆంజనేయస్వామి స్వామివారి ఏకపత్నీవ్రతం భంగం కాకుండా చూడగలిగారు.
ఇతని అగ్రజుడు అహిరావణుడు. ఇతనిని మరో విధంగా ఆంజనేయస్వామి మట్టుపెడతాడు. గుడిలో అమ్మవారి విగ్రహం వెనుక ఉండి అహిరావణుడు అమ్మవారి ముందుగా సాష్టాంగపడగానే వెనక ఉన్న ఆంజనేయస్వామి తన తోకను పెంచి వాడి మెడకు తగిలించి ముడి బిగించగానే ‘హరీ’మంటాడు. ఈ విధంగా తన ప్రభువైన శ్రీరాములవారికి ఏ ఆపదా కలగకుండా చూసి తన స్వామి భక్తిని నిరూపించుకొన్నారు ఆంజనేయస్వామి. స్వామి భక్తికి మారుపేరు ఆంజనే యస్వామి. సేవాకైంకర్యం చేయడంలో ఆంజనేయుని తర్వాతనే ఎవరైనా అన్నపేర్గాంచాడు.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం