Others

మధుసూదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

6.ప్రాణికోటిని సంకట పరచుచున్న
మత్త మధుకైటభుల బరిమార్చినావు
అమర వందిత మధుసూదనాఖ్య నిన్ను
మరువ కృప జూడవే నను మారజనక

త్రివిక్రమ
7.విక్రమంబున నాబలి చక్రవర్తి
నణచినాడవు పాతాళమున కనంత
మూడు లోకము లాశ్చర్యమున మునింగి
జూడగా త్రివిక్రమ నీదు జాడ దెలిసె

వామన
8.ముగ్ధ మోహన వామన మూర్తి నీవు
అడిగినాడవు బలిని మూడడుగుల ధర
తనకు కీడని దెలిసియు దనుజ విభుడు
దానమివ్వగ నిండవే భూ నభముల

శ్రీ్ధర
9.శ్రీ్ధరా నిన్ను పూజింప సిరులు గలుగు
భయము తొలగును భవతాప బాధ తీరు
యోగి జనబృంద మందార యోగి రాజ
నీ పద ధ్యాన మీయవే నిర్మలాత్మ

హృషీకేశ
10.ఇంద్రియములను మత్త కరీంద్రములకు
అంకుశము హృషీకేశ నీ అనపమాన
మైన నామము రుూ నామమున్ స్మరించి
జేరుకుందును నవనీతచోర నిన్ను

- టంగుటూరి మహాలక్ష్మి