Others

యాజ్ఞసేని-43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవేత్త అయిన యుధిష్ఠిరుడు తిరిగి వచ్చాడు. మనలను కన్నబిడ్డలవలె ధర్మంగా పరిరక్షిస్తాడు అని వేనోళ్ళ పొగిడారు. పాండవులు కూడా వారి యోగక్షేమాలను అడిగారు.
ప్రజల జయ జయ ధ్వనులమధ్య పాండవులు, ద్రౌపది, కుంతి సమేతులై రాజమందిరాన్ని చేరారు.
రాజమందిరం చేరిన పాండవులు మొదట దృతరాష్ట్ర మహారాజుకు పాదాభివందనం చేశారు. తదుపరి పాండవులు భీష్మ పితామహుని వద్దకు చేరి అతడికి పాదాభివందనం చేశారు.
భీష్ముడు వారిని ప్రేమతో పైకిలేపి ‘‘పుత్రులారా! ఆయుష్మాన్‌భవ’’ అని ఆశీర్వదించాడు.
పిదప వారు అస్తగ్రురువైన ద్రోణాచార్యుడికి సాష్టాంగ దండ ప్రణామం గావించి అతడి ఆశీస్సులను పొందారు.
ఆపై ప్రథమ అస్తగ్రురువైన కృపాచార్యుడికి పాదాభివందనం చేసి అతడి ఆశీర్వాదాన్ని కూడా పొందారు.
ధృతరాష్ట్రుడి ఆజానుసారం పాండవులు తమ తమ భవనాల్లోకి ప్రవేశించారు.
కుంతీదేవి కోడలు ద్రౌపదితో కలిసి రాజమందిరం చేరింది.
దుర్యోధనుని భార్య భానుమతి తక్కిన తోడికోళ్ళతో కలిసి ఎదురేగి కుంతీదేవికి ద్రౌపదికి స్వాగతం పలికారు. కుంతీదేవికి పాదాభివందనం చేశారు.
రెండవ లక్ష్మీదేవివలె, శచీదేవి ప్రకాశిస్తున్న సౌందర్యరాశి అయిన ద్రౌపదిని చేరి తమకు తాము పరిచయం చేసుకొని ఆమెను ప్రేమతో కౌగిలించుకున్నారు.
‘‘చెల్లీ! ద్రౌపదీ! నీకు కురువంశంలోనికి హృదయపూర్వక స్వాగతం. నీకు మంగళవౌగాక!’’ అని భానుమతి పలికింది.
ద్రౌపది యొక్క సౌందర్యాన్ని చూచి కౌరవులు పత్నులందరూ లోలోన ఈర్ష్యపడ్డారు. ఇట్టి అందమైన స్ర్తి భూలోకంలో ఎక్కడైనా వున్నదా అని అనుకొన్నారు. కురువశానికి మణిదీపం లాంటిది.
పిదప కుంతీదేవి ద్రౌపదితో కలిసి మహారాణి ‘‘గాంధారి’ మందిరానికి చేరింది.
‘‘అక్కా! పాండుపత్ని కుంతి నీకు నమస్కరిస్తున్నది’’ అని కుంతీదేవి గాంధారి పాదాలను తాకి వందన సమర్పణగావించింది.
పిదప ద్రౌపది ‘‘మహారాజ్ఞి! పాండవపత్నినైన నేను ద్రౌపదిని నీకు పాదాభివందనం చేస్తున్నాను’’ అన్నది.
‘‘దీర్ఘసుమంగళీభవ!’’ అని ఆశీర్వదించింది. ప్రేమతో కౌగిలించుకున్నది గాంధారి. ద్రౌపదీ సమేతులై పాండవులు వచ్చారని గాంధారికి మనస్సులో భయమేర్పడింది. ఈ ‘‘పాంచాలి నా పుత్రుల మృత్యుదేవతవలె నున్నది’’ అని మనసులో తలపోసింది. పైకి కనపడకుండా మరది విదురుడిని పిలిపించింది. విదురుడు వచ్చాడు. వదిన గారికి నమస్కరించాడు. విదురుని చూచిన గాంధారి అతనితో-
‘‘విదురా! నీకిష్టమైన పాండురాజు పత్ని, రాజకుమారి అయిన కుంతీని, ద్రుపద రాజపుత్రి ‘ద్రౌపది’ని శీఘ్రంగా పాండు రాజు భవనానికి చేర్చుము. వారికి సమస్త వస్తు సామగ్రిని ఆ భవనానికి జాగ్రత్తగా చేర్చుము. కరణం, ముహూర్తము, నక్షత్రము, తిథి, శుభం అయిన కారణంగా భవనంలోనికి ప్రవేశపెట్టము. కుంతి తన పుత్రులతో క్షేమంగా ఉండాలి’’ అని అన్నది.
గాంధారి ఆజ్ఞతో విదురుడు కుంతీదేవిని, ద్రౌపదిని పాండురాజు భవనానికి చేర్చాడు. తరువాత విదురుడు కుంతీదేవితో అన్నాడు.
‘‘పాండురాజపత్నీ! ధార్తరాష్ట్రులు బహు దుర్మార్గులు. మిమ్ములను మీ సుతులతో సహా కష్టపెట్టటానికి, వీలయితే హస్తిన నుండి పంపించివేయడానికి వెనుకాడరు. అలా చేయటానికి కావలసిన మార్గానే్వషణ చేస్తుంటాడు’’ అని అన్నాడు.
‘‘మరదీ! విదురా! నీవు ఎల్లప్పుడూ పాండు తనయుల మేలు కోరేవాడవని నాకు తెలుసు. నీ మూలంగానే మేము లక్క యింటి ప్రమాదం నండి తప్పించుకొని బ్రతికి బయటపడగలిగాము.

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము