Others

ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్సానందానికి డబ్బు అవసరం లేదు. మన చుట్టూ ఉండే మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, మమతానుబంధాలు హేతువులు. ఇవి కావాలంటే కొనుక్కోవడానికి దొరకవు. కానీ మన చేతుల్లోనే చేతల్లోనే పుష్కలంగా లభ్యం అవుతాయి. ముందు మనం ఆనందమార్గాలను మనచేతుల్తో పట్టుకోవాలి. మనతో కలసి జీవించేవారిలో ఎన్ని లోపాలున్నా వాటిని మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. అవి దుర్గణాలైతే వాటిని ప్రేమతో వారి నుంచి దూరం చేయగలగాలి. అందులో కూడా వారిలోని ఏ కొంచెం మంచైనా వారికి చెవులకింపుగా చెప్పాలి. వారిని సన్మార్గంలో ఉంచేందుకు ప్రయత్నించాలి. పెద్దలైనా పిల్లలైనా వారికి నీతిగా ఉన్నందువల్లే వచ్చే లాభాలనే కాక వారికి మనస్సంతోషాన్ని చవిచూపించాలి. అపుడు కుటుంబంలోని అందరూ ఆనందంగా ఉంటారు.
*