Others

గర్భగుడి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవాలయానికి గర్భగుడి ప్రధానమైంది. ఇందులోనే ప్రధాన భగవంతుణ్ణి ప్రతిష్ఠించి ఉంటారు. గర్భగుడినే మూలస్థానం అంటారు. ఈ మూలస్థానాలన్ని కూడా హిందూ ధర్మశాస్త్రంలో ఆగమసూత్రాలను అనుసరించి నిర్మించబడిఉంటాయ. ప్రతి ఆలయంలోను విగ్రహ పరిమాణానికి తగినట్లు గర్భగుడిని నిర్మిస్తారు. ఈ రెండింటికి ఎప్పుడు ఒక నిర్ణీత సంబంధం వుండటంవల్లనే గర్భగుడి లోపల ప్రణవమంత్రం ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ప్రణవమంత్రమైన ఓంకారాన్ని ఉచ్ఛరించినపుడు ప్రతిధ్వని ఏర్పడుతుంది. గాలిలో వుండే ప్రతి అణువు కూడా కంపించి అత్యధికంగా విస్తరించుకుంటుంది. ఉచ్ఛస్వరం బయలుదేరుతుంది. నాదం ఉద్భవిస్తుంది. నాదానికి మూలం ‘ఓం’కారం. ‘ఓం’కారం రామనామంలాగా తారకం.