AADIVAVRAM - Others

తెలుగు వారి గురించి ఆర్.టి.నోబుల్ ఏమన్నాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య ఆర్.టి. నోబుల్ జీవితయానం అనే పుస్తకం వచ్చింది. ఆయన పూర్తి పేరు రాబర్ట్ టర్లింగ్‌టన్ నోబుల్. ఈ పుస్తకాన్ని ఆయన తమ్ముడు జాన్ నోబుల్ రచించాడు. 1866 కేంబ్రిడ్జ్ సస్సెక్స్‌లో ఇది అచ్చైంది. మచిలీపట్నం గురించిన ప్రస్తావన రాగానే ముందుగా నోబుల్ కళాశాల గుర్తు వస్తుంది. ఆర్.టి. నోబుల్ 1841 జులై 4వ తేదీన మద్రాస్ (చెన్నపట్నం)లో ఓడ దిగాడు. ఆయన తెలుగు వారి మధ్య క్రైస్తవ మిషనరీగా పని చేయాలని సంకల్పించుకున్నాడు. అక్కడ ఒక ఇంగ్లీష్ పాఠశాల 24 సం.లు నిర్వహించాడు. 1865లో బందరులో వచ్చిన ఉప్పెనకు ‘కలరా’ వ్యాధి బారినపడి 1865 అక్టోబర్‌లో క్రీస్తు ఏసు ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. ఆర్.టి. నోబుల్ క్రైస్తవ మత వ్యాప్తి కోసం చేసిన కృషి, చూపిన అంకిత భావం ఆ కాలంలో భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఈయన జీవిత చరిత్ర ఒక అత్యద్భుతమైన కావ్యం. అప్పటి మద్రాసు గవర్నర్ సర్ ఛార్లెస్ ట్రివిలియన్, బందరులో నోబుల్ నడిపిన పాఠశాలను ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలతో పోల్చి ప్రశంసించాడు.
హిందూమతమనే మహానది నూరు కాల్వలై చీలిపోయిందని నోబుల్ బాధపడేవారు. సుమారు నూట డెబ్బై ఏళ్ల కిందటనే బాలికా పాఠశాలల కోసం, బాలికల విద్య కోసం బాధపడ్డాడు నోబుల్. అట్టడుగు వర్గాల నెందరినో చేరదీసి విద్యావంతులను చేశాడు. వారి కోసం పారిశ్రామిక పాఠశాలలు నిర్మించే ప్రణాళికలు వేశాడు.
తెలుగు వారిని గూర్చి తెలుగు భాషను గూర్చి, ఆనాటి తెలుగు సమాజం గూర్చి ఈ పుస్తకం చాలా సమాచారం ఇస్తుంది. తెలుగు మాట్లాడే వారి సంఖ్య తమిళుల జన్మ సంఖ్యకన్నా చాలా అధికమన్నాడాయన. మద్రాసు రాజధానిలో తెలుగు వారి ప్రాంతం దక్షిణ హిందూ దేశంలో చాలా విస్తీర్ణం కలది. అక్కడ నివసించే యితర ప్రాంతాల వారికన్నా జీవన ప్రవృత్తిలోనూ, నడవడిలోనూ (మట్టు మర్యాద శీలం) తెలుగు వారు చెప్పుకోదగినవారు. వీరు గొప్ప శక్తిమంతులు, పురుషాహంకారం కలవారు. వాళ్లు ఎక్కువ స్వాతంత్య్ర ప్రియులు. బలమైన సహజ ప్రేమ ప్రవృత్తులు కలవారు. ఎక్కువగా కల్లాకపటం లేనివారు. వాళ్ల దగ్గర మోసమూ అన్యాయమూ తక్కువే. అయితే వీరి లోపాలు కూడా ఆయనను బాధించాయి. 1852లో భారతీయ జన జీవన ప్రవృత్తినీ, ముఖ్యంగా తెలుగు వారి అలసత్వాన్నీ ఆయన ఇట్లా వ్యాఖ్యానించారు.
‘ఈ దేశీయులతో సంబంధాలు, వ్యవహారాలు పెట్టుకుంటున్నప్పుడు నేను గ్రహించిన విషయం ఏమంటే వీళ్లు చైనా దేశస్థులలాగా పఠనాసక్తులు కారు. అక్షరాస్యులై పుస్తకాలు చదవాలని కోరుకోరు. ఈ దేశంలో అసంఖ్యాకులు చదువనే లేదు. మిగిలిన వారిలో కొందరు కొన్ని శ్లోకాలు, పద్యాలు వల్లిస్తారు. వీటి అర్థం వాళ్లకు తెలియదు. తెలుసుకుందామని కూడా అనుకోరు. తెలుగు ప్రాంతం మద్రాసు రాజధాని తూర్పు తీరం వెంట ఇంచుమించు 700 మైళ్ల వరకు వ్యాపించి ఉంది. మచిలీ పట్నానికి, నిజాం నవాబు పాలించే సంస్థాన రాజధాని అయిన హైదరాబాద్ 280 మైళ్ల దూరంలో ఉంది. అయితే ఈ దూరంలో 60 మైళ్ల వరకు బ్రిటీషు వారిది. ఇంకా తెలుగు వారిని గూర్చిన వివరాలు కావాలంటే ఉత్తరాన గంజాం జిల్లా మొదలుకొని 6 జిల్లాలు తెలుగు వారివి. ఈ అన్ని ప్రాంతాల జనాభా ముప్పై రెండు లక్షల ఎనభై అయిదు వేలు. (గంజాం, విశాఖపట్నం, రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు) ఈ జిల్లాలే కాక కడప, చిత్తూరు, బళ్ళారి జిల్లాలు కూడా తెలుగువారివే (ఇవి నిజాం పాలనలో వుండేవి) ఇంకా మైసూరుకు చెందిన విశాల ప్రాంతం, నాగపూరు పరగణాలో కొంత భాగం కలిపితే తమిళులకన్నా తెలుగు వారిది అధిక జన సంఖ్య. అంతేకాక భారతదేశ ద్వీపకల్పం (పెనిన్సులా) లో ఇతర ప్రాంతీయ భాషలకన్నా తెలుగే ప్రాధాన్యం పొందుతుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్, రాబర్ట్ నోబుల్, ఎ.డి.కాంబెల్, హెచ్.ఎస్.ఎల్లెస్, మద్రాసులోనే తెలుగు నేర్చుకున్నారు. ఇప్పుడు తెలుగు ఏమైపోతుందని నిర్వేదం పాలైనాము.

-అక్కిరాజు రమాపతిరావు