AADIVAVRAM - Others

ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు దేశాలు ఏదైనా ఆట ఆడుతున్నపుడు ఆ దేశవాసులు తమ జట్టు గెలవాలని అనుకుంటారు. అది సహజం. మంచిది కూడా. ఆటగాళ్లు ఓడిపోతే చాలా నిరుత్సాహం కూడా చెందుతారు.
క్రికెట్ ఆటలో మన వాళ్లు ఓడిపోతే మన దేశవాసులు చాలా నిరుత్సాహపడతారు. క్రికెటర్లని టమోటాలతో కొట్టిన సందర్భాలు కూడా వున్నాయి.
క్రికెటర్లు అమ్ముడుపోకుండా ఆడినప్పుడు కూడా ఈ విధంగా క్రికెట్ అభిమానులు ప్రవర్తించడం సరైంది కాదు. ఆటని ఆటలాగా చూడాలి. వాళ్ల ప్రయత్నంలో లోపం ఉందా అన్న విషయాన్ని గమనించాలి. వాళ్లు ఎంత కష్టపడారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకానీ ఓడిపోతే వాళ్ల మీద కోపం ప్రదర్శించకూడదు. సాధారణంగా నేను ఆటలు చూడను. అనుకోకుండా, ఈ మధ్య టీవీలో ఫుట్‌బాల్ ఆటను చూస్తున్నప్పుడు ఓ నాలుగు వాక్యాలు కన్పించాయి. అవి నన్ను బాగా ఆకర్షించాయి. అవి-
‘విజయం కాదు ప్రయత్నం
గోల్ కాదు ఆట
మన పనిలో గర్వాన్ని ఇచ్చేది’
ఈ మాటలు ఒక ఫుట్‌బాల్ ఆటకే పరిమితం కాదు. అన్ని ఆటలకు వర్తిస్తాయి. ఆటలకన్నా ముఖ్యంగా మన జీవితాలకి వర్తిస్తాయి.
ప్రతి పనిలో మనం విజయాన్ని ఆశిస్తాం. కాని అన్నిసార్లు విజయం మనల్ని వరించదు. అందుకని ఈ వాక్యాలని గుర్తుపెట్టుకోవాలని అన్పించింది. మన ప్రయత్నంలో లోపం వుండకూడదు. అది ముఖ్యం.
జీవిత ప్రయాణం లభించే విజయాన్ని ఆనందంగా స్వీకరించాలి.
అపజయాలు ఎదురైనప్పుడు నిరుత్సాహం చెందకూడదు.
ఎవరైనా విజయానికి హామీ ఇవ్వలేరు.
కానీ ప్రయత్నానికి హామీ ఇవ్వగలరు.
అందుకే విజయాలని ఆకాంక్షించాలి.
అపజయాలని స్వీకరించాలి.
అన్నింటికన్నా ముఖ్యం మన ప్రయత్నంలో ఎలాంటి లోపం వుండకూడదు.
ఆ మూడు మాటలు ఆటలో ఎంత గుర్తుంచుకోవాలో జీవితంలో అంతకన్నా ఎక్కువ గుర్తుంచుకోవాలి.

- జింబో 94404 83001