Others

సుమధుర రామాయణం.. (బాలకాండం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధవళ వస్త్రంబు దరహాస దంతి ముఖము
ఏక దంతంబుతో వెలుగొందునట్టి
సకల విద్యల కెల్లదానొజ్ఞయైన
కొండ మనుమని కెపుడు దండంబ లిడుదు

1. శ్రీ సమృద్ధవౌ కోసల దేశమందు
సూర్య వంశజు డిక్ష్వాకు చక్రవర్తి
మనువు నిర్మితవౌ అయోధ్యానగరము
రాజధానిగ రాజ్యము జేయుచుండె

2.అతని నామము దశరథుండతి యశస్వి
సుగుణ వతులు కౌసల్య కైకయు సుమిత్ర
లాజనపతికి పట్టపు రాణులైరి
అందు రాజుకు కైకేయి ముద్ద్భుర్య

3.ఎన్ని సౌభాగ్యములు గల్గియున్నగాని
పుత్ర సంతతి లేక తపించి రాజు
కుల గురువు వసిష్ఠునకు నమస్కరించి
పుత్ర సంతాన మార్గము దెల్పుడనియె

4.బ్రహ్మ మానస పుత్రుడాబ్రహ్మ తపసి
పుత్ర కామేష్టి యాగమా పత్యలాభ
మునకు జేయుగ బనిచె యాగమ్ము ఋష్య
శృంగు నధ్వర్యమున బరి పూర్ణమయ్యె

5.యజ్ఞకుండము నందుండి యజ్ఞ పురుషు
డుద్భవించి పాయస పాత్ర ప్రభునకిచ్చి
పత్నులకు నివ్వగా బల్కి జనియె, రాజు
సంతసమ్మున భార్యల జేరబిలిచి

6.అగ్ర మహిషికి సగమిచ్చె పాయసమ్ము
మిగత సగమందు సగము సుమిత్ర కొసగి
కడపటి సగము రొండె భాగములు చేసి
కైక సుమిత్రల కొసగె భూకాంతు డపుడు

7.పట్టమహిషులు భుజియించ్రి పాయసమ్ము
గర్భవతులైరి సర్వుల భాగ్యమనగ
చైత్రశుద్ధి నవమిని పునర్వసందు
పరమ పురుషుడు కౌసల్య కుద్భవించె

8.నీల నీరద గాత్రంబు తేజరిల్ల
కమలదళనేత్ర యుగళమ్ము కాంతులీన
రఘుకులమ్మును వెలయించు రత్నమనగ
అవతరించెను బ్రహ్మంబు అవనిలోన

9.కమలదళ నేత్రి కైకేయి కొక సుతుండు
రాజ వదన సుమిత్రకు రాజితముగ
కవలులిర్వురు రజనియించి రవని విభుడు
అతులి తానంద పరవశుడై జెలంగ

10.పూల వానలు గురిసె భూలలన మురిసె
నుత్సవంబుల పట్టణ మోలలాడె
భూరి దక్షిణ లందిరి భూమి సురులు
పద్మనాభుడు నాల్గు రూపుల జనింప

11.యోగి జనముల హృదయాభి రాముడౌట
సకల జనముల నయనాభి రాముడౌట
రాముడని నామకరణము జేసె నగ్ర
సుతన కవ్వసిష్టుండు ప్రజ్ఞ్ధాకుండు

టంగుటూరి మహాలక్ష్మి