Others

వివేకంతోనే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలకు ఎక్కువ సహన శక్తి ఉన్నట్టే వివేకం పాళ్లుఎక్కువే ఉంటుంది. సమస్య ఏదైనా రాగానే చాలా ఆలోచిస్తున్నాననుకొని చాలామంది పురుషులు సిగెరెట్స్ తాగేస్తుంటారు. మరికొందరు మద్యపానం పుచ్చుకుంటూ ఉంటారు. ఇన్ని చేసినా సమస్యకు పరిష్కారం మాత్రం ఏచేద్దాం అంటూ తమ తమ భార్యల దగ్గరే వస్తారని సర్వేలు తెలుపుతున్నాయ. ఆఫీసుల్లో ఆందోళనైనా, ఇంట్లో ఆర్థిక సమస్యలనైనా ఏ సమస్యనైనా స్ర్తిలు అలవోకగా ఆలోచించి ఎవరికీ నష్టం లేకుండా పరిష్కరించేస్తుంటారు. సమస్యా పరిష్కారానికి ముఖ్యంగా సమస్య ఎక్కడ నుంచి ఉత్పన్నమైందో కనుక్కోవాలి. దాని మూలం ఎక్కడుందో తెలిస్తే చాలు మంచి మందు వేయచ్చు. అలా వేస్తే సమస్య కాస్త తగ్గిపోతుంది. పిరికితనం, ద్వేషం, భయం అనేవి లేకపోతే సమస్యను పరిష్కరించడం తేలిక అని స్ర్తిల అభిప్రాయం అని సర్వేలే చెబుతున్నాయ. ఆనాడు అర్జునుడు కూడా యుద్ధరంగం తనవారు అనేది చూసి బెంబేలు పడిపోయాడు. కృష్ణుడు దగ్గరకు వచ్చి భుజం తట్టి నీకు నేను ఉన్నా నని భరోసా ఇచ్చి పోరుసాగించాడు. అంతే అర్జునుడు విజయలక్ష్మిని చేపట్టాడు. అట్లానే ఏసమస్యకైనా స్ర్తి నేనున్నానులే అని ముందుకు వచ్చి నిలబడిందనుకోండి సగం సమస్య సమసిపోతుంది. ఇక వివేకంతో ఒక్క అడుగు వేస్తే చాలు సమస్యకు ఇట్టే పరిష్కారం కనబడుతుంది.