Others

ప్రయాణమై...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెగిన వాక్యాల్ని తిరిగి సిద్ధం చేసుకుని
భాషల్ని లోలోపలికి అనువదించుకుని
ఆశల్ని ఆవాహనం చేసుకుని
కొత్త గొంతును సవరించుకున్నాక
మరో ప్రయాణం మొదలైంది
నిర్బంధాల వంతెనమీద నడుస్తుంటే
సహస్ర స్వరాల వెదురుగొంతుల వేదన
ఆర్తుల్ని దిద్దుతున్న అమ్మ గుండె అనిపించింది
నిజమే.. హృదయ ప్రమిదల్లో ఎన్ని చీకట్లో
నిశ్శబ్ద స్వరాల ప్రసారంలో
ఎనె్నన్ని కన్నీటి సముద్రాలో
పరిమళం పూసుకున్న మట్టిపాట
పరివ్యాప్తమై శిథిల పత్రాలను
తడిమాక తెలిసింది
ఆపదల్లో ఆప్తవాక్యమంటే ఏమిటో
చైతన్యం కృంగినా
పొగ మంచు కమ్మినా
ప్రాణరసం ఇంకిపోవద్దన్న ధీమా
జయాపజయాల జమాఖర్చులు
సశేషాల అసంపూర్తులు
చరమ క్షణాల చెడుగుడాటలు
విపత్కర విభాజకాలడ్డొచ్చినా
యుద్ధాన్ని గెలిచి తీరాలన్న విశ్వాసం
నిర్ణిద్రంగా, నిరాఘాటంగా
సాగిపోవాలన్న మొండి తెగింపు
‘మృత్యు’నీడలు నమ్మకాల్ని వమ్ముచేసినా
ఉక్కు పునాదిగా నిలబడాలన్న సంకల్పం
మెదులుతూ కలకలం రేపే కెరటాలు
సందిగ్ధ మేఘాలను ఊదేస్తాయి
చీకటి వర్షాలు
వలస విషాదాలు
బతుకులోని అల్లికల మెలికలే
ప్రయాణం పలుమార్లయినా అది
జీవిత పాఠాల్ని వల్లె వేయించి
పూర్ణాకృతిగా నడిపిస్తుంది మనల్ని
ప్రయాణం రాతి ముద్ద కాదు
ప్రయాణం నిత్యనిర్మలం
ప్రయాణం రసప్రపూర్ణం
ప్రయాణం అనుభవాల పూర్ణకుంభం

- తిరునగరి శ్రీనివాస్, 9441464764