Others

సుమధుర రామాయణం.. (బాలకాండం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12.అంత కైకేయి సుతునకు భరతడనెడు
నామ మమరగ జేసి సుమిత్ర సుతుల
కవలులకు లక్ష్మణుడు శతృఘు్నలనెడు
పేర్ల నిర్ణయించెను గురుశ్రేష్ఠుడపుడు

13.దశరధేశున కత్యంత ప్రీతికరుడు
రామభద్రుడు సుగుణాలరాశి యతడు
తల్లులకు తమ్ములకు జనావళికి నెల్ల
సంతతానందదాయి కౌసల్యసుతుడు

14.పంచవత్సర ప్రాయులై పరగు సుతుల
కొప్పుగా నుపనయన సంస్కారములను
జేసి సకల విద్యాగరిష్ఠులనొనర్చె
నవ్వసిష్టుడు బుధ జన సేవితుండు

15.ఒక దినమ్మున బ్రహ్మర్షి కౌశికుండు
వచ్చెనను వార్త దెలియగ సంభ్రమించి
శీఘ్రగతినేగి వౌనిని తోడితెచ్చి
అర్ఘ్యపాద్యములిచ్చి యర్చించి రాజు

16.తమరి రాకచే నా జన్మ ధన్యమయ్యె
ఏమి కార్యార్థమిటకు విచ్చెసినారో
ఆనతీయుడు మీరేమి యాజ్ఞనీయ
తలను దాల్చెదనని మ్రొక్కె ధరణి విభుడు

17.వినయ సంయుతు డిక్ష్వాకువిభుడు బల్కు
పలుకులను విని సంతసపడుచు వౌని
దేవతా పితృగణములు దనియు నొక్క
యజ్ఞమును జేయగా సమకట్టి నేను
18.క్రతు విఘ్న కరుల నిశాచరుల జంపి
యజ్ఞరక్షణ జేయ నీ జ్యేష్ఠపుత్రు
గొంచు బోవగ వచ్చితి బంఫు మనగ
దిగులుజెందిన రాజుకు గురువరుండు

19.చెంతకును బిల్చి వివరించె దశరథునకు
కశ్యపుడవీపు తొల్లి కౌసల్య అదితి
మీతపంబుకు శ్రీహరి మెచ్చి మీకు
సతుడ నయ్యెదనని వరింబించె ననఘ

20.హరియె రాజీవ నేత్రుడు రామభద్రు
డాదిశేషుడె లక్ష్మణుం డీరహస్య
మెవ్వరెరుగని నిజమని గురువరుండు
దెల్పె రాజుకు నమర రహస్యమపుడు

21.్ధర్మపరుడు విశ్వామిత్రుడలఘు తపసి
సంశయింపక పంపుము సుతుని వౌని
వెంట శుభమగు రామచంద్రునకు ననగ
గురు వశిష్టుని వచనము ల్వినియతండు

22.శీఘ్రమే రామలక్ష్మణులను బిలువగ
నంపి చేరి పాదాభివాదనముల జేయు
సుతుల ముద్దాడుకొని వౌని కప్పగించె
కొమరులను దోడుకొనిజెన కౌశికుండు

23.దాశరథులు గాధేయుని తోడ నరుగ
మూడు పడగల కోడె నాగరును నట్టు
దోచె లోక ళ్యంమున కిది నాంది
యనుచు బల్కిరి దేవతా బృందమంత
*