Others

ఇక నైరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ఒక్కడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మధురిమ మంచి నటిగానే నిరూపించుకున్నా సరైన అవకాశాలు రాలేదు. కొన్నాళ్లు గ్లామర్ పాత్రలకు తాను దూరమంటూ చెప్పేసరికి కొన్ని అవకాశాలు మిస్ చేసుకుంది. ఆ తరువాత గ్లామర్ పాత్రలకు సై అన్నా, కాలాతీతమవడంతో అవి కూడా దగ్గరికి రాలేదు. అరకొరా పాత్రలతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చి ఇప్పుడు కళ్లు తెరిచింది మధురిమ. తన పేరును నైరా బెనర్జిగా మార్చుకుంది. ఇటీవలే ఆమె సన్నీలియోన్‌తో కలిసి నటించిన ‘వన్ నైట్ స్టాండ్’ విడుదలైంది. సన్నీలియోన్‌తో సన్నివేశాలంటే అవి ఎంత గ్లామర్‌తో ఎక్స్‌పోజింగ్‌తో వుంటాయో ఇక చెప్పనవసరం లేదు. మొదట ఆ సినిమాలో నటించడానికి భయపడినా ఆ తరువాత తన మనసుకు తానే సర్ది చెప్పుకుందట. ఈ పేరుతో అయినా మధురిమకు అవకాశాలు కలిసి వస్తాయా? లేకపోతే ‘నై’ అంటాయా? చూడాల్సిందే!