Others

క్రియా యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మిక ప్రపంచంలో ధ్యాన యోగ మార్గంలో ప్రపంచానికంతా కూడా సుపరిచితులు గౌతమబుద్ధులు. వారు ఈ ప్రపంచానికి ‘ఆనాపానసతి’ (శ్వాస మీద ధ్యాస) ధ్యాన మార్గాన్ని సమర్పించారు. అత్యంత ప్రాముఖ్యమైన ఈ ‘్ధ్యన పద్ధతి’ని బుద్ధుని శిష్యులు పరంపరగా ప్రపంచంలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. ‘ఆనాపానసతి’తోబాటు నాలుగు ఆర్య సత్యాలను మరి అష్టాంగ మార్గాన్ని బుద్ధుడు మనకు తెలిపాడు.
ఈ ‘ఆనాపానసతి’ని ‘శ్వాస మీద ధ్యాస’ అనే సులభమైన నామంతో ఈ సమస్త ప్రపంచానికీ పరిచయం చేసిన వారు బ్రహ్మర్షి పత్రీజీ. వారు ప్రత్యక్షంగా అయిదు కోట్ల మందికి ‘శ్వాస మీద ధ్యాస’ను బోధించారు, సంగీతాన్ని ఆలంబనగా చేసుకుని! పరోక్షంగా మరెన్నో కోట్ల మందికి నేర్పారు ధ్యానాన్ని! పిరమిడ్ మాస్టర్లుగా పేరు పొందిన వారి అనుయాయులు రెండు లక్షల మంది ఈ ప్రపంచమంతా ‘శ్వాస మీద ధ్యాస’ ధ్యాన ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు గత రెండు వందల యాభై సంవత్సరాలుగా క్రియా యోగాన్ని తమ శిష్యుల ద్వారా ఈ ప్రపంచానికి అందజేసినవారు మహావతార్ బాబాజీ. వారు హిమాలయాలలో ఇప్పటికీ అజ్ఞాతంగా ఉంటూ అప్పుడప్పుడు వారికి కృప కల్గిన వారికి దర్శనం ఇస్తూ ఉంటారని ప్రతీతి. మహావతార్ బాబాజీ - గురువులను తయారుచేసి పంపుతారు హిమాలయాల నుండి. అలా వారు తయారుచేసిన గురువులు మూడు ఆశ్రమాలవారు.
వారిలో మొదటి ఆశ్రమ గురువులు గృహస్థాశ్రమ గురువులు. ‘యోగిరాజు’ అని పిలువబడిన ‘పురాణ పురుషశ్రీ శ్యామాచరణ లాహిరీ’ తదితరులు ఈ సంసారాశ్రమానికి చెందినవారు. కుటుంబ వ్యవస్థలో ఉంటూ, ఉద్యోగం చేస్తూనే భార్యాపిల్లలను గమనించుకుంటూ, పెళ్లిళ్లు చేస్తూ పూర్తిగా సంసారాన్ని బాధ్యతతో నిర్వహిస్తూ ఉదయం, సాయంత్రం, సెలవు దినాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ క్రియా యోగాన్ని బోధించినవారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం తక్క మిగిలిన సమయమంతా సాధనకు, బోధనకు ఉపయోగించారు. సాధారణంగా రాత్రిళ్లు సాధన చేసేవారు. ఇచ్ఛా మరణాన్ని పొందినవారు - జీవన్ముక్తులు. అనితరసాధ్యమైన యోగ సిద్ధి పొందిన బుద్ధులు - యోగిరాజు లాహిరి.
లాహిరీ మహాశయులు ఉద్యోగ బదిలీల సమయం తప్ప తాము పరమపదించే వరకూ కాశీ మహాక్షేత్రంలో నివసించారు. 1872లో షిర్డీబాబా లాహిరీ మహాశయుల నుండే క్రియా యోగ దీక్షను స్వీకరించారని లాహిరీ మహాశయుల జీవిత చరిత్రలో వ్రాయబడింది.
‘లాహిరీజీ’ ముఖ్య శిష్యులు యుక్తేశ్వర్‌గిరి. వీరు తమ భార్య మరణించేవరకు గృహస్థాశ్రమంలో ఉండి ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించినవారు. కలకత్తాలోని దక్షిణేశ్వరంలోనూ, పూరీలోనూ వీరి ఆశ్రమాలున్నాయి. పూరీలోనే వీరు మహా సమాధి చేయబడ్డారు.
యుక్తేశ్వర్‌గిరిగారి ముఖ్య శిష్యులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక యోగి ఆత్మకథ పుస్తక రచయిత పరమహంస యోగానంద. ఈ గ్రంథరాజం ప్రపంచంలోని అన్ని ప్రముఖ భాషల్లో, భారతదేశంలోని 16 భాషల్లో అనువదింపబడి ఎన్నిసార్లు పునర్ముద్రణకు నోచుకుందో! పరమహంస యోగానంద భారతదేశంలో విరివిగా పర్యటించారు. ఎన్నో రాష్ట్రాల్లో క్రియా యోగాన్ని బోధిస్తూ మరి ఎందరో గురువులను కలుసుకుంటూ! 1920 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడి, క్రియా యోగాన్ని బోధించినవారు. పూర్తికాలపు సన్యాసి అయిన వీరు 1952లో పరమపదించారు. కాలఫోర్నియాలోనే వీరి మహాసమాధి ఉంది.
-సశేషం
(బ్రహ్మర్షి పత్రీజీ ప్రవచనాల సంకలనం)

-మారం శివప్రసాద్