Others

క్రియా యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహావతార్ బాబాజీ తయారుచేసిన గురువులెందరో ఉన్నారు. వారిలో ప్రముఖులు లాహిరీ మహాశయులు. లాహిరీ మహాశయులు ముఖ్య శిష్యులు యుక్తేశ్వర్ గిరి. యుక్తేశ్వర్ గిరి ముఖ్య శిష్యులు యోగానంద పరమహంస.
ఇలా మహావతార్ బాబాజీ పరంపరలో మూడు రకాలైన గురువులు.
* లాహిరీజీ లాంటి పూర్తికాలపు గృహస్థాశ్రమంలో ఉండే ఆధ్యాత్మిక గురువులు!
* యుక్తేశ్వర్ గిరి లాంటి మొదట సంసారాశ్రమం ఆపై సన్యాసాశ్రమ గురువులు!
* పరమహంస యోగానంద లాంటి పూర్తి కాలపు సన్యాసాశ్రమ గురువులు!
ఇలా ఎవరెవరు వారివారి ఇచ్ఛనుబట్టి ఆయా ఆశ్రమాలలో స్థితులలో ధ్యాన, జ్ఞానముక్తి మార్గాలలో జీవితాలను సార్థకం చేసుకోవాలని మహావతార్ బాబాజీ ఆకాంక్ష - సంకల్పం.
మనం మహావతార్ బాబాజీ గురించి విన్నది కాని చూసింది కాని ఒక హద్దుకు లోబడి పనిచేసే మానవ మేధస్సుకు పైది - అంత సులభంగా అవగతం అయేదీ కాదు. ఒక యోగి ఆత్మకథలో పై మువ్వురి గురువులతోబాటు మహావతార్ బాబాజీ గురించి కూడా ఎంతో సమాచారం ఉంది. ఆ పుస్తకంలో బాబాజీ వారి గురించి ఒక చోట ఇలా చెప్పారు;
ఒకసారి బాబాజీ తన అనుయాయులతో నరసంచారం అరుదుగా మాత్రమే జరిగే కీకారణ్యం (హిమాలయాలలో)లో వెళుతున్నారు. దట్టమైన అడవులు, కొండలు, లోయలు, మంచుతో నిండిన శిఖరాలు ప్రమాదభరితమైన ప్రాంతమది. ఒక ఆగంతకుడు ఈ కొండలు అధిగమించి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ‘బాబాజీ’ వారి దగ్గరికి చేరుకున్నాడు. బాబాజీ! తమ యొక్క అనే్వషణలో నెలలు, సంవత్సరాలు గడచిపోయాయి. అదృష్టవశాత్తూ తమ దర్శన భాగ్యం కలిగింది. మీరు నన్ను శిష్యునిగా స్వీకరించండి అని వేడుకున్నాడు అతడు.
బాబాజీ ఆ మాటలు విని వౌనంగా ఉండిపోయారు. ఎంతసేపటికీ బదులు ఇవ్వలేదు. బాబాజీ ఏమీ పలుకనందున ఆ వ్యక్తి - బాబాజీ! ఇన్ని అమిత వ్యయ ప్రయాసలకు ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చి కూడా నాకు ధన్యత కలుగలేదు. మీ కటాక్షం పొంది మీ శిష్యునిగా ఉండకపోతే ఈ నా ప్రాణానికి విలువే లేదు అని చెప్పాడు. అప్పటికి కూడా బాబాజీ వారి నుండి సమాధానం రాకపోయేసరికి, ఆ ఆగంతకుడు అగాధమైన కొండ లోయలోకి దూకేశాడు. శరీరం తునాతునకలయి ఉంటుంది. శిష్య వర్గం భయకంపితులై పోయారు.
బాబాజీ నిస్సంగులు. కొంతసేపైన తర్వాత ఆ దూకిన వ్యక్తి శరీర ఖండాలను తీసుకురమ్మని తమ శిష్యులను ఆదేశించారు. అనంత యోగశక్తి గలవారు ఏమైనా చేయగలరు కదా! బాబాజీ ప్రసాదించిన యోగశక్తితో కొందరు శిష్యులు లోయ లోపలికి వెళ్లి కొండ దూకిన వ్యక్తి శరీర భాగాలను మూటకట్టి తెచ్చి బాబాజీ వారి వద్ద ఉంచారు.
‘సృష్టి రహస్యాలన్నీ తెలిసిన మహావతార్ బాబాజీ’ తమ యోగశక్తితో ఆ విగత జీవునికి ప్రాణం పోశారు. మాంసపు ముద్దలు, విరిగిన ఎముకల ఖండాలలోంచి సరిక్రొత్త శరీరం ఆవిర్భవించింది. మృత్యుంజయుడైన అతడిని బాబాజీ శిష్యునిగా అంగీకరించాడు.
ఎలాగయితే హిరణ్యగర్భుడైన బ్రహ్మ బ్రహ్మజ్ఞాన యోగానికి ఆదిగురువో అలాగుననే మహావతార్ బాబాజీ క్రియా యోగానికి ఆదిగురువు. ఆచార్యుడైన పతంజలి మహర్షి యోగ సిద్ధాంతం కూడా హిరణ్యగర్భుని సూత్రంపైనే ఆధారపడి ఉంది. ‘తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియా యోగూ’ అని నుడివారు పతంజలి మహర్షి! ‘తపస్సు - స్వాధ్యాయం - ఈశ్వర ప్రణిధానం’ అనబడే అసలైన మూడు ప్రక్రియలూ సంపూర్ణంగా కలిస్తేనే ‘క్రియాయోగం’ అవుతుంది.
(బ్రహ్మర్షి పత్రీజీ ప్రవచనాల సంకలనం మరియు ఒక యోగి ఆత్మకథ పుస్తక సౌజన్యంతో)

-మారం శివప్రసాద్.. 9618306173