Others

అప్పట్లో షూటింగ్ అంత ఈజీ కాదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటేనే అయస్కాంతశక్తి. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే ఆ ఆనందమే వేరప్పా! అని అనిపిస్తుంటుంది. కానీ, ఒక సన్నివేశం స్క్రీన్‌మీద కనిపించినంత హాయగా, షూట్ చేసేటప్పుడు ఉండదు. ఇప్పుడంటే సినిమా సాంకేతికత చెప్పలేనంతగా అందుబాటులోకి వచ్చింది కనుక, ఏ చిన్న విషయాన్నైనా సిజిలో కవర్ చేస్తున్నారు. ఒకప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ, ప్రేక్షకుడు ఆశించిన ఆనందాన్ని, హాయని సన్నివేశంలో చూపించడం కోసం ఎన్నో కష్టాలు పడేవారు. ఆ విషయం ఈ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది. ఒకవైపు సహ నటీనటుల భావాలను సమన్వయం చేసుకుంటూ, దర్శకుడు చెప్పే సూచనలు పాటిస్తూ, కెమెరాకు అనుగుణంగా మూమెంట్స్ ఇవ్వగలగాలి. అప్పుడే సన్నివేశం పండుతుంది. ఇక్కడ ఈ వర్కింగ్ స్టిల్స్ అలాంటివే. తొలినాళ్ళల్లో షూటింగ్ ఏవిధంగా వుండేదో మొదటి చిత్రం చూస్తే అర్థమవుతుంది. ఓ పండుగలా బయటికి వచ్చి ఔట్‌డోర్ షూటింగ్ చేసేవారు. చుట్టుప్రక్కల దొరికే పండు, ఫలాలతోనే ఆకలిని సంతృప్తిపర్చుకుంటూ షూటింగ్ పూర్తి చేసేవారు. సీరియస్ సన్నివేశాల చిత్రీకరణలో పెద్దగా ఇబ్బందులు లేకున్నా, శృంగారపరమైన సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు కష్టపడవలసి వచ్చేది. ముఖ్యంగా స్ర్తిపాత్రధారులు అంతమంది షూటింగ్ యూనిట్‌ముందు శృంగార భావాలలో నటించడానికి ఇబ్బందిపడేవారన్న విషయం ఈ స్టిల్‌లో గమనించొచ్చు. ఆమె నటిస్తుంటే షూటింగ్ స్పాట్‌లో వున్న అందరూ గమనిస్తూ వుంటారు. దాంతోనే ఎక్కడలేని సిగ్గు ముంచుకొస్తుంది. అలా నటించడం నిజంగా నటులకు ఓ వరమే! కెమెరా వ్యూలో కనిపించే నటీనటుల పక్కనే అసిస్టెంట్ డైరెక్టర్లు, కోడైరెక్టర్లు ఎందరో వుంటారు. కానీ వారందరూ ఫిలింలోకి రారు. ఇక్కడ అక్కినేని, సావిత్రిల ఫొటో గమనిస్తే అది అర్థమవుతుంది. ఓ సినిమా పాటకు సంబంధించిన షూటింగ్ అది. అక్కడ సావిత్రి పైటకొంగు రెపరెపలాడాలి. అక్కినేని నాగేశ్వరరావు ఏదీ పట్టుకోకుండా ముందుకు రావాలి. ఆ సీన్‌లో అక్కినేని అలా చేస్తే పడిపోతారు కనుక, అక్కడున్న దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు హీరో ఏఎన్నార్ చేయ ఇలా పట్టుకున్నారు. అదేవిధంగా నటి సావిత్రి పైటకొంగు రెపరెపలాడాలి కనుక ప్యాన్‌వేస్తే మిగతా నటీనటుల విగ్గులు చెడిపోతాయికనుక వెనుక వున్న అసిస్టెంట్ డైరెక్టర్ పైటకొంగు గాలికి రెపరెపలాడుతున్నట్లు చేతితోనే రెపరెపలాడిస్తున్నారు. ఇంతకూ సావిత్రి కొంగు పట్టుకున్న ఆ దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా? ఆయనే కళాతపస్వి కె.విశ్వనాధ్! ఇలా వుంటాయి సినిమా కష్టాలు. ఎవరి కష్టాలు వారివి. ముఖ్యంగా నటించేవారి కష్టం సామాన్యమైనది కాదని ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది కదూ!

-తిలక్