Others

ధ్యానం - స్వాధ్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తపస్సు’ అంటే శారీరకమైన, భౌతికమైన అవసరాలను..
అంటే తిండి, నిద్ర మొదలైన వాటిని.. క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావడం!
‘స్వాధ్యాయం’ అంటే ఆత్మవికాసానికి నూటికి నూరు శాతం దోహదకారి అయ్యే గ్రంథాలను అధ్యయనం చేయడం!
‘ఈశ్వర ప్రణిధానం’ అంటే అంతా దైవమయం!
‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అన్న ఎరుకను సదా కలిగి ఉండడం!
ధ్యానం ద్వారానే, ధ్యాన అభ్యాసం ద్వారానే పై మూడూ సాధించడం సాధ్యం. వేరే మార్గమే లేదు. అన్యధా శరణం నాస్తి. ధ్యానమనేది ఎంత ముఖ్యమో, ఆధ్యాత్మిక ప్రగతికి స్వాధ్యాయం అనేది అంతకన్నా ముఖ్యం. ధ్యానుల అనుభవాలు మరి పుస్తక రూపం పొందినపుడు.. అవి అన్నింటికన్నా ఉత్కృష్టమైన గ్రంథాలు అవుతాయి. ఆ గ్రంథాలను చదవడం అన్నది చాలాచాలా ముఖ్యం.
ప్రపంచంలో ఎక్కడెక్కడ ధ్యానయోగులున్నారో, అందరి అనుభవాలూ అధ్యయనం చేయాలి. స్వాధ్యాయం మనిషి యొక్క నాలుగవ శరీరాన్ని అంటే ‘విజ్ఞానమయ కోశాన్ని’ శుద్ధి చేస్తుంది.. అభివృద్ధి చేస్తుంది.
శ్రీ యోగానంద పరమహంస వ్రాసిన ఆధ్యాత్మిక గ్రంథరాజం ఒక యోగి ఆత్మకథ లో యోగానందగారి అనేకానేక ఆత్మానుభవాలు, ప్రేరణలు, అవగాహనలు, అనుభూతులు ఉన్నాయి. మహావతార్ బాబాజీ గురించి, లాహిరీ మహాశయుల అనుభవాల గురించి, యుక్తేశ్వర్ గిరి అనుభవాల గురించి, మహావతార్ బాబాజీ మరి వారి ఇతర ముఖ్య శిష్యుల గురించి మనకు ఏ మాత్రం తెలియని అత్యంత అనుభవ విశేషాలు ఈ మహత్తర గ్రంథంలో ఉన్నాయి.
ముఖ్యంగా శ్రీ యుక్తేశ్వర్ గిరి (్ఫరమహంస యోగా నంద గురువు)గారి ‘పునరుత్థానం’ అనే అధ్యాయం మొత్తం గ్రంథానికే తలమానికం. మరణించిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్‌గిరి వారు సశరీరులై తిరిగి వచ్చి శ్రీ యోగానంద గారికి దర్శనమిచ్చి, మరణానంతర జీవితం గురించి వివరించిన వైనం మహాద్భుతం. మనం ప్రతి ఒక్కరి ధ్యాన అనుభవాలూ చదవాలి.
ఇక్కడ మనం ఒక పిరమిడ్ మాస్టర్‌గా మారిన కళ్లం రామిరెడ్డి (విజయవాడ) వారి అనుభవాన్ని విందాం! వారి ధ్యానానుభవాలు తెలుసుకుందాం!
‘ఒకప్పుడు అంటే ధ్యానంలోకి రాక ముందు నేనొక కరడుగట్టిన కమ్యూనిస్టుని. సిపిఐ -ఎం మార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనై ఆ క్రమంలో గ్రామ యువజన సంఘం కార్యదర్శినయ్యాను. పార్టీ సిద్ధాంతాల పట్ల అమిత గౌరవంతో, కమ్యూనిస్టు పార్టీలో పనిచేసే కుటుంబంలోని అమ్మాయి రమణిని పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు పిల్లల తండ్రినయ్యాను. పుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క సమీప సాన్నిహిత్యంలో పనిచేసిన నేను, విగ్రహారాధననూ, వాస్తునూ, గ్రహబలాలనూ, ముహూర్తాలనూ దేనినీ నమ్మేవాడిని కాదు. మూఢ నమ్మకాల మీద యుద్ధం చేసేవాడిని.
అలాంటి నేను ధ్యాన మార్గంలోకి రావడం విచిత్రం. ఒక పిరమిడ్ మాస్టర్ మిత్రుడు ఎనిమిది సంవత్సరాలుగా మోకాళ్ల నొప్పులతో ‘మందులు’ కూడా మింగలేని స్థితిలో ఉన్న నా భార్య రమణి బాధ చూసి ధ్యానం చేయించమన్నాడు. కళ్లు మూసుకుని చేతులు కలిపి కూర్చుంటే ఇంత అనారోగ్యం పోతుందా? అని ఎద్దేవా చేశాను.
(బ్రహ్మర్షి పత్రీజీ ప్రవచనాల సంకలనం మరి ‘్ధ్యనజగత్’ సౌజన్యంతో)

-మారం శివప్రసాద్.. 9618306173