Others

పిల్లనగ్రోవినై రోదిస్తున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలనం లేని మనసు
విరామం ఎరుగని మనసు
అడుగులు పడేకొద్దీ
వెనక్కు జంకుతున్న
నా హృదయం!

సప్తవర్ణాల సూర్యకిరణాలు
తెల్లని ముసుగులోనే
ఒదిగి ఒదిగి పోతున్నాయి!

సూర్యోదయం కోసం
వేచివేచి పగటి చీకటిలోనే
పయనిస్తున్న నా హృదయం!

దేహానికి ముళ్లను
కంచెగా వేసుకున్న నిన్ను
చేయి చాచి అందుకోలేక
పైటగాలి వీచేకొద్దీ
నీ చెయి స్పర్శ తగలక
నేను పిల్లనగ్రోవినై రోదిస్తున్నా...

-కుంచె -చింతా లక్ష్మీనారాయణ 9908830477