Others

నాకు నచ్చిన సినిమా..మంగమ్మ శపథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1965లో విడుదలైన డి.వి.ఎస్ ప్రొడక్షన్ పతాకంపై డి.వి.ఎస్.రాజు, ప్రముఖ దర్శకుడు విఠలాచార్య దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఆ దేశపు రాజు స్ర్తిలను మోహిస్తూ అనుభవించి వదిలివేస్తూ వినోదిస్తాడు. ఒకసారి గ్రామీణ యువతి మంగమ్మను మోహించి బలవంతం చేయబోగా ధైర్యసాహసాలతో అడ్డుకుంటుంది. మంగమ్మను బలవంతంగా వివాహం చేసుకుంటానని తాను దేశ మహారాజునని బెదిరించగా, అతని ద్వారా కుమారుడిని కని రాజుకు తగిన బుద్ధిచెబుతానని ఆమె ప్రతిజ్ఞ చేయగా, అధికార బలంతో వివాహం చేసుకున్న రాజు ఆమెతో కాపురం చేయకుండా వేరే గృహంలో నిర్బంధించడం, మంగమ్మ తన కుటుంబ సభ్యుల సహకారంతో భూగర్భ మార్గం ద్వారా మారువేషంలో రాజుకి చేరువై గర్భవతియై కుమారుడిని కనడం, అతడు తల్లి కోరికపై తన రూపంలో వున్న రాజును రకరకాలుగా ఏడిపించి బుద్ధిచెప్పే విషయాన్ని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. విలాసవంతుడైన రాజుగా, తండ్రికి బుద్ధిచెప్పిన కొడుకుగా ఎన్.టి.ఆర్. నటన ప్రత్యేక ఆకర్షణ, సాహస యువతిగా, విలాసవంతుడై స్ర్తిలను భోగవస్తువుగా చూసే భర్తకు తగిన బుద్ధిచెప్పిన వనితగా జమున చక్కటి నటన ప్రదర్శించారు. ఇంకా రేలంగి, గిరిజ, మిక్కిలినేని, వాణిశ్రీ, రమణారెడ్డి, ఎల్.విజయలక్ష్మి, రాజనాల, అల్లురామలింగయ్య మొ.వారు తమ పాత్రలతో మెప్పించారు. టి.వి.రాజు స్వరకల్పనలో ఘంటసాల, సుశీల గానం చేసిన పాటలు ‘రివ్వునసాగె, రేరాజు పిలిచెను’, వయ్యారమెలికె చిన్నది’, ‘కనులీవేళ చిలిపిగ నవ్వెను’వంటి గీతాలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆబాలగోపాలం ఆనందించిన వినోదభరిత చిత్రం.

**
వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

- ఎస్.ఎస్.శాస్ర్తీ, విశాఖపట్నం