Others

సుమధుర రామాయణం.. (బాలకాండం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంత కాలము గడిచె నయోధ్య జనులు
46. రామ సందర్శన నానంద హృదయ లౌచు
గడుపుచుండిరి రామభద్రునకు యిరువ
దైదు వత్సరములు రాగ దశరథుండు
తనదు వృద్ధాప్యము గ్రహస్థితిని దలచి

47. గురు వశిష్టునితో నొక్కనాడు రాజు
రామపట్ట్భా షేకము జరుప నిశ్చ
యించినాడ మీయనుమతి తోడ ననగ
సంతసమ్మున సభ దీర్చజెప్పె గురుడు

48. మంత్రి సామంతులును పురోహితులు దండ
నాయకులు పురప్రముఖుల తోడ రాజు
కొలువు దీరిచి వినిపించె కౌసలేయు
రాజ్యపట్ట్భాషిక్తుని జేయు వార్త

49. పులకరించిరి సభలోనే పెద్ద లెల్ల
వినయశీలి మృదుమధుర భాషి ధర్మ
పరుడు శస్త్రాస్త్ర కుశలుడు రామభద్రు
డవని పాలింపు టది మేము గోరు నదియె

50. ముక్త కంఠులై సభలోని వారు బల్క
రామచంద్రుని దోడ్కొనిరా సుమంత్రు
నంప తృటిలోని దోడ్కొని వచ్చె నతడు
వందన మొనర్చు పుత్రుని వెన్ను నిమిరి

51. లేచి రాముని కనులార జూచుకొనుచు
సరస గూర్చుండ బెట్టుక రామభద్ర!
వసుధ పాలించితిని మన పూర్వులవలె
ధర్మబద్ధంబు గానింత వరకు తనయ

52. వయసు పండెను వృద్ధాప్య మొచ్చెనింక
నిన్ను రాజ్యాభిషిక్తుని జేసి నేను

విశ్రమించగ దలిచితి పుత్ర యనగ
శిరము వంచి తండ్రికి నమస్కృతులొనర్చె
53. అందరనుమతి గొని నిజమందిరమ్ము
జేరి తల్లికి వినిపించె తండ్రి తనకు
రాజ్య పట్ట్భాషేకము జేయు వార్త
సంతసిల్లి కౌసల్య వేల్పులకు మ్రొక్కె

54. రాజు నభిమతమున మునిరాజు యెల్లి
రామపట్ట్భాషేకము నిశ్చయించె
హర్షపులకితులైరి సమస్త జనులు
రామ రాజ్యము సుఖదాయక మ్మటంచు

55. నగర మంతయు మంగళ వాద్యములతో
మారు మ్రోగెను వీధులన్నియును రంగ
వల్లులను దీర్చి ముత్యపు తోరణములు
గట్టి రెచ్చట విన్న నీవార్తె పురిని

56. రామ పట్ట్భాషేకము జూడవచ్చు
జనులతో కలకలలాడె నగరమంత
దాసి మంధర దుర్బోధ వినిన కైక
పతిని గోరెను రాజ్యము భరతు కీయ

57. మరియు రాముని పదునాల్గు వత్సరములు
దండకారణ్యమున కేగి తపసి యగుచు
గడప వలెనంచు వరములు గోరె రెండు
తనకు పతిమును వొసగిన వాని నిపుడు

58. వజ్రఘాతము నంగూలు నద్రి రీతి
దుఃఖమున ధర గూలెక్షితీశు డపుడు
తండ్రి సత్యము నెరవేర్ప తనయు డరిగె
వనమునకు సీత లక్ష్మణు ల్వెంటరాగ

టంగుటూరి మహాలక్ష్మి