Others

తరచి చూస్తే నిజాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పరిస్థితులలో డార్విన్ సిద్ధాంతానికి సరియైన ఆధారాలు దొరకడం కష్టం! ఆ సిద్ధాంతంమీద ఆధారపడి ఆలోచించే విధానాన్ని బట్టి వానరుడి నుంచి అల్పమానవుడు, వాడినుండి ఉత్తమ మానవుడు క్రమ వికాసం చెందారనే భావన శోభనివ్వదు. నేటి పరిస్థితి సమీక్షిస్తే ఉత్తమ మానవుని స్థితి నుండి అల్ప బుద్ధి కలిగిన మానవుడై ప్రళయాన్ని సృష్టించుకుని వినాశనాన్ని పొంది మరలా క్రమ వికాసాన్ని పొంది ఉత్తమ స్థితికి చేరుతాడని అవగతవౌతుంది.
ఇదే మన భారతీయ సృష్టి- ప్రళయ క్రమచక్రాన్ని తెలియచేస్తోంది.నవీన విజ్ఞాన శాస్త్రం బహుముఖాలుగా శాఖోఫశాఖలుగా విస్తరించి నేటి మానవుడికి గర్వకారణంగా వుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న రుూ వైజ్ఞానిక యుగం వయస్సు ఎంత అని చూస్తే, కేవలం 300 సంవత్సరాలు మహా పొడిగిస్తే 500 సంవత్సరాలకు మించి లేదు.
పాశ్చాత్య చరిత్రకారులు మానవ జాతి విజ్ఞానకాల పరిమితిని ముఖ్యంగా భారతీయ విజ్ఞాన వికాసాన్ని సాధ్యమైనంత తక్కువ కాలానికి కుదించారు. వారి లెక్కల ప్రకారం వేద సంహితలు రూపొందించిన కాలం 500 బిసికి లోపే. బ్రాహ్మణాలు రూపొందిన కాలం 1200 బిసి నుండి 1500 బిసిలోపు. ఈ రెండింటి మధ్యకాలంలో కల్పసూత్రాలు రచించబడ్డాయని పురాణాలు, బ్రాహ్మణాలు యించుమించు ఒకేకాలం నాటివని చెప్పారు. స్మృతులు 900 బిసి నుండి 600 బిసి మధ్యకాలానివని చెప్పారు. మహాభారత రచన 1200 బిసి నాటిదని పేర్కొన్నారు.
అయితే కొంతమంది పాశ్చాత్య చరిత్రకారులే దీనిని ఖండిస్తూ మహాభారత రచనాకాలం 3100 బిసి నాటిదై వుండి తీరాలని లెక్కగట్టారు. విచిత్రమేమిటంటే రామాయణం మాత్ర 900 బిసి నుండి 800 బిసి నాటి రచనగా చెప్పారు. అంటే మహాభారతం తరువాత కాలమన్నమాట. ఇవీ వారు భారతీయ వాఙ్మయం గురించి వేసిన లెక్కలు. ఎంత అసంబద్ధమో చూడండి.
భారతదేశంలో ఏ గృహిణి నడిగినా చెబుతుంది రామావతారం తరువాత కృష్ణావతారం. త్రేతాయుగం తరువాత ద్వాపర యుగమని. భారతీయమైన చరిత్ర నిర్మాణ ప ద్ధతి విస్పష్టంగా సంశయ రహితంగా వుంటుంది. దానికి కారణం ఖగోళంలోని నక్షత్ర గతులను, స్థితులను బట్టి చారిత్రకాంశాలను నిర్యించే విధానం మనది. అయితే భారతీయమైన కాలగణన ఎప్పుడూ సుదీర్ఘంగా పునరావృతవౌతూంటుంది. సృష్టిలయాలు పునరావృతమవుతుంటాయి. ప్రతి సృష్టిలోనూ మన్వంతరాలు మహా యుగాలు, యుగాలు పునరావృతవౌతుంటాయి.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590