Others

నిగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వామి వివేకానంధ మహాజ్ఞాని మాత్రమే కాదు, గొప్ప అధ్యాపకుడు కూడా. ‘నాకు ధ్యానం ఎలా చే యాలో తెలియడం లేదు. నిగ్రహం గా ఉండలేకపోతున్నాన’ని వివేకానందుడిని ఒక భక్తుడు అడిగాడు. ఆ భక్తుడిని వివేకానందుడు ఒక చెరువు దగ్గరకు తీసుకుపోయాడు. నీళ్లలోకి దించాడు. అకస్మాత్తుగా అతనిని నీళ్లలో ముంచాడు. ఆ భక్తుడు నీళ్లలో తల్లడిల్లాడు. ఇంకా ఒత్తిడికి గురి చేశాడు. చివరకు భక్తుడు వివేకానందుడి నుంచి విడిపించుకుని నీళ్ల నుంచి పైకి లేచాడు. అప్పుడు వివేకానందుడు- ‘కేంద్రీకరించటం అంటే ఇప్పుడు అర్థమయ్యిందా?’ అని అడిగాడు. నీటిలో మునగటం ప్రధానం కాదు, దానిపై ఎంత దృష్టి కేంద్రీకరించావన్నది ప్రధానం అని ఆయన వివరించాడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పిల్లలను జ్ఞాన సముద్రంలో ముంచుతాడు. పాఠాన్ని కంఠస్థం చేయటం చదువు కాదు. దాన్ని అర్థం చేసుకోవడానికి తన్నుకులాడటం చదువు. అదే విద్యార్థి మానసిక స్థితిని ప్రేరేపిస్తుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు స్విచ్ వెయ్యంగానే లైట్ వెలగదు. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకంగా గొణుగుతాడు. తరగతి గది నుంచి పోయేటప్పుడు విద్యార్థి ఎంత తన్నుకులాడతాడో అది ఆ విద్యార్థి అవగాహనకు ఉపయోగపడుతుంది. నువ్వొక పనిచేస్తున్నప్పుడు దాన్ని తప్ప మరేదాన్నీ గురించి ఆలోచించకూడదు. దానే్న ఆరాధనగా, మహోన్నత ఆరాధనగా ఆ పనిపైననే పూర్తిగా మనసును కేంద్రీకరించాలి. ఇది ఉపాధ్యాయనికి, విద్యార్థికి కూడా వర్తిస్తుంది.
నేడు తరగతి గదికి వెళుతున్నప్పుడు కొందరు పిల్లలు, ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు తీసుకువస్తున్నారు. దాని వలన మన తరగతి గదికే అంతరాయం కలుగుతుంది. ఉపాధ్యాయుడు మాట్లాడే ప్రతి మాట వెనుక ఎంతో గాఢ తపస్సు ఉంటుందని పిల్లలు భావించే స్థితికి రావాలి. ఆషామాషీగా కాకుండా, ఉపాధ్యాయుడిని ఆరాధిస్తున్నామన్న భావన విద్యార్థిలో కలగాలి. అప్పుడు ఆ విద్యార్థి తరగతి గదిని ఆరాధిస్తాడు. ఈత కొడుతున్నప్పుడు శరీరంపైన, నీటి ప్రవాహంపైన కేంద్రీకరిస్తేనే ఈదగలుగుతారు. చాలామంది ఉపాధ్యాయులు తరగతిలో ఉన్నప్పుడు క్లాసెస్ డిస్టర్బ్ చేయరు. అందుకే ఆ భావనతోనే తరగతికి ఉపాధ్యాయుడు సర్వాధికారం గల రాజు అంటారు. అంటే దీనర్థం టీచర్ పెత్తనం కాదు. టీచర్ పనిలో బయటి వారి జోక్యం పనికి రాదు. తరగతి గదిపై ఉపాధ్యాయులు తమ దృష్టిని ఎంత కేంద్రీకరిస్తే విద్యార్థులకు అంతే స్థాయిలో శ్రద్ధ పెరుగుతుంది. అందుకే తరగతి గదిని సముద్రంతో పోల్చుతారు.
గురుదక్షిణ...
ఉపాధ్యాయుడు తన పరిధిని అర్థం చేసుకొని పాఠం చెబితే విద్యార్థి లక్ష్యం పూర్తవుతుంది. ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని యథాతథంగా బ్యాంకులో నిల్వ చేసినట్లు కాదు. అది విద్యార్థి మెదడులోకి పోయి ఏవో కొత్త పరిస్థితులకు, అన్వయానికి ఉపయోగపడుతుంది. వాటిని గమనంలోకి తీసుకుంటాడు. అది బేసిక్ అండర్‌స్టాండ్ వరకే ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించటం విద్యార్థి కుశలత. విద్యార్థి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తాడు. ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క కోణంలో చూస్తుంటాడు. సమాచారాన్ని విశే్లషణ నిర్వహిస్తాడు. సమాచారాన్ని తనలో ఇముడ్చుకోవడం, అర్థం చేసుకోవటం, తన పదాలలోకి మార్చుకుని ఆ జ్ఞానాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవటం, దాన్ని ఉపయోగించటం, దాన్ని విశే్లషణ చేయటం, దాన్ని సమన్వయం చేయటం, దాన్ని సమర్ధించే కారణాలు పరిశోధించటం... ఈ ప్రక్రియలను విద్యార్థి పూర్తి చేస్తేనే కొత్తజ్ఞానాన్ని సృష్టించగలడు. విద్యార్థికి లెర్నింగ్ ప్రాసెస్ టీచింగ్ ప్రాక్టీస్ కన్నా బహుముఖంగా ఉంటుంది. గురువు రగిలిస్తే శిష్యుడు కాంతిగా మారిపోయి ఎన్నో రకాలుగా వెలుగు నివ్వగలుగుతాడు. ఆ వెలుగును ఎక్కడ, ఎప్పుడు ప్రసరింపచేయాలో చూడాలి. గురువు చెప్పిన వాక్యానికి విద్యార్థులు నానా అర్థాలు తీస్తారు. లెర్నింగ్ అనేది టీచింగ్ కన్నా ఎక్కువ బాధ్యతాయుతమైంది. దాని వల్లనే విద్యార్థి కూడా గురువుకు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తాడు. అదే విద్యార్థి ఇచ్చే గురుదక్షిణ.
- చుక్కా రామయ్య

- చుక్కా రామయ్య