Others

ధ్యాన ఆనందహేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా భార్య మాట కాదనలేక విజయవాడ మాచవరంలో ఉన్న జక్కా రాఘవరావుగారి పిరమిడ్ హౌస్‌కు వెళ్లాను. నా భార్యను తీసుకుని అందరూ పత్రీజీ యొక్క ‘వేణునాదం’ వింటూ ధ్యానం చేస్తుంటే నేను మ్యూజిక్‌ను ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత బెంగళూరులోని ‘పిరమిడ్ వ్యాలీ’కి నా భార్యను తీసుకుని వెళ్లాను. ‘మైత్రేయ బుద్ధా యోగా పిరమిడ్’లో కూర్చుని బలవంతంగా కళ్లు మూసుకున్నాను. అది బుద్ధపౌర్ణిమ ఉత్సవాల సందర్భం.
ఆ పిరమిడ్ 160 ఇంటు 160 సైజు పిరమిడ్. 5వేల మంది ఒకసారి కూర్చుని ‘ధ్యానం’ చేయవచ్చు. ప్రతి సంవత్సరం ఎక్కడికో ఒకచోటికి నా భార్యతో కలిసి విహారయాత్ర చేసే నేను మిత్రుడి బలవంతంతో బెంగళూరు వద్ద పెద్ద పిరమిడ్‌కు వచ్చాను. అక్కడ మూడు రోజులున్నాం. ధ్యానం గురించి ఏ మాత్రం సదభిప్రాయం లేని నేను, నాలాంటి ఇంకా కొందరు తప్పించుకొని తిరిగే బ్యాచ్‌తో కలిసి పిరమిడ్ బయట కూర్చుని లోపల ధ్యానం చేస్తున్న వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడాను.
అయితే ధ్యానం చేసి బయటకు వచ్చినవారు, అక్కడ అంతా తిరుగుతూ ఉన్నవారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. అక్కడక్కడ అందరూ తమ ధ్యానానుభవాలు పరస్పరం చర్చించుకుంటున్నారు. అపుడు నేను నా మనసులో - ఈ ధ్యానంలో ఈ పిరమిడ్‌లో ఏదో శక్తి ఉండే ఉంటుంది. లేకపోతే ఇన్ని వేల మంది క్యూగా ఎందుకు వెళుతున్నారు అని తర్జనభర్జన పడ్డాను. రెండు రోజుల తర్జనభర్జన తర్వాత, మూడవ రోజు నా భార్యతో కలిసి వెళ్లి పిరమిడ్‌లో కూర్చున్నాను. పత్రీజీ స్టేజీపైన ఉన్నారు.
బ్రహ్మర్షి పత్రీజీ ఫ్లూట్ వాయిస్తూ మధ్యలో ధ్యానం గురించి వివరిస్తున్నారు. నేను ఫ్లూట్ వింటూ మరొక పక్క పత్రీజీ ప్రవచనం వింటూ కళ్లు మూసుకుని ధ్యాన స్థితిలోకి వెళ్లిపోయాను నా ప్రమేయం లేకుండా. అపుడు మొదలైంది నాలో ధ్యాన ఆనందహేల. క్రమంగా నేను ఆలోచనా రహిత స్థితిలోకి వెళ్లిపోయాను. ఏ ఆలోచనా లేని స్థితిలో.. ఆ శూన్య స్థితిలో.. నాభి నుంచి మొదలై లావాలాగా పైకి ఎగసిపడుతున్న ఏదో తెలియని శక్తి ప్రసారంతో.. తట్టుకోలేని ఆనంద స్థితిలో కళ్లు మూసుకుని ఉన్న నాలో పకపకమని నవ్వు.
అలా దాదాపు ఒక మూడు గంటలు గడిచిపోయాయనుకుంటాను. పత్రీజీ ఓకే! అని చెప్పి అందరూ కళ్లు తెరిచిన తర్వాత, వాళ్లు చప్పట్లు కొడుతూ ఉంటే అపుడు నేను కళ్లు తెరిచాను. ఆనందంతో ఊగిపోతున్న నేను నా భార్య భుజాలను పట్టుకుని ఊపేస్తూ.. ఈ రోజు నాకు బ్రహ్మానందాన్ని రుచి చూపించావు.. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను’ అని ఎంతో ఉద్విగ్నంగా చెప్పాను.
మా ఆవిడ మోకాళ్ల నొప్పులు క్రమంగా తగ్గిపోయాయి. ఆ తర్వాత కొద్దికాలానికే మేం శ్రావణబెళగొళకు వెళ్లాం. అక్కడి ఆరువందల మెట్లూ ఆవిడ చకచకా ఎక్కింది నాకంటే ముందు. అలా అలా ధ్యానంలో నేను క్రమంగా మరింత మరింత ఎదిగాను. క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. విజయవాడలో కృష్ణానది ఒడ్డున అవతలి వైపు హైవేకు కి.మీ. దూరంలో 36 ఇంటు 36 పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించాను. వసతి సౌకర్యాలు కల్పించాను. ధ్యానం క్లాసులు చెబుతూ ఇటీవల పోయిన సంవత్సరం మానస సరోవరం, ఈ సంవత్సరం అనుభవమే జ్ఞానం పుస్తకాలు రాశాను. మా పిరమిడ్‌కు ‘మానస సరోవరం ధ్యాన ఆశ్రమం’ అనే నామాన్ని పెట్టారు బ్రహ్మర్షి పత్రీజీ.
ఇలా వేల లక్షల మంది తమ ధ్యానానుభవాలను వ్రాయాలి. అది అందరూ చదవాలి. ‘స్వాధ్యాయం’లో ఇదొక భాగం. ఇదీ కళ్లం రామిరెడ్డిగారి అనుభవం!
‘్ధ్యనం - అహింస - పిరమిడ్ శక్తి - ఆధ్యాత్మిక పరిపాలన’ అనే నాలుగు అంగాలతో ‘్ధ్యనం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన అహింసా ప్రచారం, ఆచార్య సాంగత్యం’ అనే అయిదు అంశాలతో బ్రహ్మర్షి పత్రీజీ ‘పిరమిడ్ స్పిరిచ్యుయల్ సొసైటీస్ మూవ్‌మెంట్’ ను 1991లో స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.
ధ్యానం మరి ఆత్మజ్ఞానం ఉన్నవాళ్లే తమతమ జీవితాలలో అద్భుతంగా రాణించగలుగుతారు. చిన్నవయసు నుండే ప్రతి ఒక్కరూ రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్త, ఆదిశంకరాచార్య, ఓషో, షిర్డీ సాయిబాబా, సత్యసాయి బాబా లాగే ధ్యానం చేస్తూ.. ఇతర ప్రాపంచిక విద్యలతోబాటు ఆత్మవిజ్ఞాన శాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాలి!
(బ్రహ్మర్షి పత్రీజీ ప్రవచనాల సంకలనం మరి ‘్ధ్యనజగత్’ సౌజన్యంతో)

-మారం శివప్రసాద్.. 9618306173