Others

వస్తు స్పృహ, సారళ్యత కలబోసిన కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపురూపం (కథలు)
-డా.లక్ష్మీరాఘవ
వెల: రూ.100
ప్రతులకు: రచయిత్రి, 3-99, అప్పగారి వీధి
కురబలకోట, చిత్తూరు జిల్లా.
*
సృజనాత్మకత ఉంటే, ఏ రంగంలోనైనా రాణించవచ్చుననే సత్యానికి నిలువెత్తు నిదర్శనం డా.లక్ష్మీరాఘవగారు. చిన్నప్పటి నుండీ కళలపై మక్కువ పెంచుకున్న డా.లక్ష్మిగారు. పెన్సిల్‌తో స్కెచెస్ వేస్తారు, చాక్‌పీసుల మీద కార్వింగ్ చేస్తారు. ఎండుకొబ్బరి గిలకల మీద ‘కార్వింగ్’ చేస్తారు. కేండిల్ మేకింగ్, పేపర్‌తో.. గుడ్డతో అందమైన పువ్వులు చేస్తారు. పెయింటింగ్‌లు వేస్తారు. డాన్సులు, నాటకాల మీద ఆసక్తి ఉంది. వీటన్నింటినీ మించి కథలల్లుతారు. లోగడ వీరి కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి. ఇది డా.లక్ష్మిగారి మూడో కథాసంకలనం. ఇందులో 23 చిన్న కథలున్నాయి. ఇవన్నీ వివిధ పత్రికలలో, ఎక్కువగా అంతర్జాల పత్రికల్లో వచ్చాయి.
వాస్తవాలకు అతి దగ్గరగా రాస్తున్న ఈ రచయిత్రి కథలు చాలావరకు ప్రబోధాత్మకంగా ఉంటాయి. సమాజానికి ఓ సందేశం ఇస్తూ, కనబడుతాయి. తను కన్నవీ, విన్నవీ, అనుభూతించినవీ, తనదైన దృష్టితో రాస్తారు కనుక, ఈ కథల్లోని పాత్రలు (ఒకటి రెండు తప్ప) మధ్యవయస్కులు, ఆపై వయసుపైబడిన వారుగా కనిపిస్తారు. అందుకే వీరి కథలు అన్నీ, నల్లేరు మీద నడకలా, నిశ్చల తటాకంలోని పడవ ప్రయాణంలా సాఫీగా ఉంటాయి. క్రొత్తదనాన్ని, పాత విషయాల్ని కొత్త కోణంలో చూపిస్తూ అలరిస్తాయి. ‘గృహప్రవేశం’ అనగానే ఉదయత్పూర్వం కొత్తకొత్త కాలనీల్లో ఉంటాయి ఇళ్లు. గృహ ప్రవేశం ముహూర్తానికే రానరక్కలేదనీ - వారు ఎప్పుడు వస్తే అప్పుడే గృహ ప్రవేశ ఉత్సవం అని, తమ బంధువులకు పార్వతి సాంబశివరావు దంపతులు చెప్పటం ఓ కొత్త కోణం. మంచి మనసు, మానవత్వం గల ఈ రచయిత్రి పార్వతి సాంబశివరావు దంపతుల ద్వారా ఆహార పదార్థాలను వృధా చేయవద్దన్న సందేశం గొప్పగా ఉంది ‘ఇలాచేస్తే’ కథలో.
ఆడపడుచు మనసెరిగి, అటు ఆడపడుచుకు ఇటు అత్తకూ సంతృప్తి కలుగచేస్తుంది ఒక ఆదర్శ కోడలు రత్న ‘అపురూపం’లో. ఈ కథలో అత్తగారి అభీష్టం కాదని ఆడపడుచు అడిగిన నగలు ఆమెకు ఇవ్వటం కోడలు హృదయ వైశాల్యాన్ని చాటుతుంది. గొప్ప మనసున్న వాళ్లే చేయగలుగుతారు ఈ పనిని.
రాష్ట్ర విభజనలోని రాజకీయాలు అటుంచి, ఎలా సర్దుకుపోవాలో చెబుతుంది ‘మార్పూ మనసు’లో. ఆసరా ఉంటే ఎంతటి అంగవైకల్యాన్ని అయినా జయించవచ్చుననే సందేశం ఇచ్చే ‘ఆసరా’. ప్రతీ కథ చివర ఒక గొప్ప, మానవతా విలువలతో కూడిన సందేశం ఉంటుంది.
డా.లక్ష్మీ రాఘవగారి కథలన్నీంటా, ఇంచుమించు అన్ని కథలు, మధ్యతరగతి కుటుంబాల మనస్తత్వాల చిత్రీకరణ ఉంటుంది.
ఎన్నోచోట్ల జీవిత సత్యాలను ఆయా కథలకు, పాత్రలకు అనుగుణంగా చెప్పించారు. ‘ఎంత వయసు వచ్చినా అలనాటి జ్ఞాపకాలు అపురూపం’ అంటారు (పే.9) ‘మానవ నైజాలు పలురకాలు. దేనినీ తప్పు పట్టలేం’ (పే.12) ‘మార్పు వచ్చినప్పుడు మనసుకు నచ్చదు ఏ వయసు వారికైనా. కాని ఆ మార్పు మనం ఎదగడానికి అనుకున్నప్పుడు, ఆ ఎదగటం మన జీవితాలలో అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది అని తెలిసినప్పుడు మారాల్సిందే’ అంటారు (పే.38). ఇవన్నీ స్ఫాలీపులాక న్యాయంగా ఉదహరించబడ్డాయి మాత్రమే!
అనవసర వర్ణనలు, శషభిషలకు పోకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, సరళంగా కథాసంఘటనల్లో ఇమిడ్చి చెప్పారు రచయిత్రి. వీరి మొదటి సంపుటిలోని కథలన్నీ కన్నడంలోకి అనువదించబడి, పత్రికల్లో ప్రచురించబడి, ప్రస్తుతం ఓ సంకలన రూపంలో, కన్నడంలో వస్తున్నదట! విశ్వజనీన సత్యాలకు ఏ భాషలోనైనా ఆదరణకు లోటు ఉండదు కద!

-కూర చిదంబరం.. 8639338675