Others

నాకు నచ్చిన పాట--మూగమనసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1964లో బాబూ మూవీస్ ‘మూగ మనసులు’ విడుదల అయింది. ఆదుర్తి సుబ్బారావుగారి దర్శకత్వంలో నాగేశ్వరరావు, సావిత్రి, జమున, సూర్యకాంతం, గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం మొదలైన వారితో నిర్మించబడి అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రమిది. మూడు జన్మల మరపురాని కావ్యంగా నిర్మించబడిన చిత్రంలో ‘పాడుతా తీయగా..’ గీతాన్ని ఘంటసాల పాడగా కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. సావిత్రి పాత్ర ఉన్న జమిందారీ కుటుంబానికి పడవ నడిపేవాడు కథానాయకుడైన నాగేశ్వరరావు. సావిత్రి భర్తగా నటించిన నటుడు పద్మనాభం. అతడు మరణించి సావిత్రి విధవరాలు అవుతుంది. ఆమెను ఓదార్చడానికి వచ్చిన నాగేశ్వరరావు పాత్ర పాడే పాటే ఇది. నేటికీ ప్రేక్షకుల, శ్రోతల హృదయాల్ని దోచుకుని.. టీవీ ప్రసారాల్లో పాడుతా తీయగా చల్లగా అని ఒక కార్యక్రమానికి నాందీ ప్రస్తావనగా, ఇంపైన పాటగా నిలచింది. నిదుర రాని అమ్మాయిగారి కళ్ళకు నిదుర వచ్చేటట్లు పాడిన మధుర గీతమిది.
‘పాడుతా తీయగా చల్లగా/ పసి పాపలా నిదురపో తల్లిగా/ బంగారు తల్లిగా’ అని లాలిస్తూ..
‘కునుకు పడితే మనసుకాస్త కుదుట పడతది/ కుదుట పడ్డ మనస్సు తీపి కలలు కంటది
కలలు మనకు మిగిలిపోవు కలిమి చివరకు/ ఆ కలిమి కూడ దోచుకొనే దొరలు ఎందుకు అంటారు ఈ పాటలో ఆచార్య ఆత్రేయ. అర్థాలను వెతుక్కోవాల్సిన పనిలేని తేటతేట పదాల్లో జీవితసారాన్ని అందిస్తూ ఆత్రేయ పలికించిన ఓదార్పు, పాత్రధారిణికే కాదు, దుఃఖంతోవున్న ప్రతి మనిషికీ హాయనిచ్చేపాట ఇది.
చావుపుటక లేనిదమ్మ నేస్తమన్నది/ జనమ జనమకది మరీ గట్టిపడతది..
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు/ ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు
పరామర్శించడానికి వచ్చిన ఆ పాత్రధారి -జన్మలను బంధాల్ని విడమరచి ఓదార్చే భావన అక్షరమక్షరంలో మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. జీవితాన్ని తేట తెలుగు పదాల్లో చెప్పిన ఆచార్య ఆత్రేయ, పాటను వినసొంపుగా కన్నీటి గీతంగా చక్కగా ఆలిపించిన ఘంటసాల, విషాద గీతంలోనూ గొప్ప మాధుర్యాన్ని స్వరపర్చిన కె.వి.మహదేవన్‌ల ఘనత ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు. బహుశ ఈ పాట నచ్చలేదనో, అర్థంకాలేదనో చెప్పే సాహసం ఏ ఒక్కరూ చేయలేరని నా నమ్మకం. కంటతడి పెట్టించే పాట ఇది.

- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం