Others

డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-అనిల్ రావిపూడి

తెలుగులో దర్శకుడిగా తొలి ‘పటాస్’ పేల్చి మంచి విజయాన్ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకుని, వెంటనే మరో ఛాన్స్ దక్కించుకున్నాడు. మెగా మేనల్లుడు సాయిధరమ్‌తో సుప్రీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్‌తో చిట్‌చాట్...

ద్వితీయ విఘ్నం దాటేసినట్టున్నారు?
-ఔను. రెండో సినిమా కూడా మంచి విజయం సాధించడం ఆనందంగా వుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌కే
ప్రాధాన్యత ఇస్తున్నారు?
-ఇప్పుడు ప్రేక్షకులకి ఈ తరహా సినిమాలే నచ్చుతున్నాయి కదా.

రీమిక్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు?
-నేను పెరిగిన సమయంలో వచ్చిన సినిమాల ప్రభావం నాపై చాలా వుంది. వాటికి నేను డాన్స్ కూడా చేసేవాణ్ణి. కాబట్టే ఆ పాటల్ని పెట్టాలని ఉంది.

ఇంతకీ సినిమాలో ఛాన్స్
ఎలా వచ్చింది?
-మాది ప్రకాశం జిల్లా. మా బాబాయి దర్శకుడు పి.అరుణ్‌ప్రసాద్. ఆయన దగ్గర గౌతమ్ ఎస్‌ఎస్‌సి సినిమాతో అసిస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చా. మా నాన్న ఆర్టీసీలో డ్రైవర్. బిటెక్ తర్వాత సినిమాల్లోకెళ్తానంటే నీ ఇష్టం అన్నారు.

తొలి అవకాశం?
-దర్శకత్వ శాఖలో చేస్తూనే రచయితగానూ చేశాను. 2012లో రాసుకున్న కథ ఇది. కళ్యాణ్ ఓమ్ సినిమా చేస్తుండగా ఆయన్ను కలిశాను. ఆ తర్వాత కథ విని నచ్చిందన్నారు. సినిమా రావడానికి చాలా టైమ్ పట్టింది.

నెక్స్ట్ ప్రాజెక్ట్?
-ప్రస్తుతానికి కథలైతే ఉన్నాయి. చర్చల దశలో ఉన్నాయి. ఫైనల్ అయ్యాక చెబుతా.

-శ్రీ