Others

కవిసంధ్య కవితల పోటీలో ‘గాడ్స్ డెత్ సర్టిఫికెట్’కు ప్రథమ బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా పానుగంటి ఫౌండేషన్ సహకారంతో కవిసంధ్య, కవిత్వ పత్రిక నిర్వహించిన కవితల పోటీలో విజయవాడకు చెందిన బంగార్రాజు కంఠ కవిత ‘గాడ్స్ డెత్ సర్టిఫికెట్’ మొదటి బహుమతి గెలుచుకుంది. యానాంకు చెందిన పి.అశోక్ కుమార్ కవిత ‘ఇంటి పాదాలవద్ద’ ద్వితీయ బహుమతినీ, వరంగల్‌కు చెందిన బండారి రాజ్‌కుమార్ ‘నల్లకుందేలు’ కవిత తృతీయ బహుమతినీ గెలుచుకున్నాయ. సాంధ్యశ్రీ, నిశాపతి, దేశ్‌రాజు, సి.ఎస్.రాంబాబు, కుంచె నాగసత్యనారాయణ, పల్లెపట్టు నాగరాజు, మార్ని జానకిరామ చౌదరి, ఆకొండి ధన్వంతరి, కె. ఉషా సరస్వతి, టి.వెంకటేష్ కవితలు ప్రత్యేక బహుమతికి ఎంపికయ్యాయ. కవితల పోటీకి న్యాయనిర్ణేతలుగా సుధామ, పోటీల కన్వీనర్ దాట్ల దేవదానం రాజు వ్యవహరించారు. బహుమతులను మార్చి 21న యానాంలో జరిగే ప్రపంచ కవితా దినోత్సవంలో ప్రదానం చేయనున్నట్లు కవిసంధ్య అధ్యక్షులు శిఖామణి ఒక ప్రకటనలో తెలిపారు.