Others

‘వి’రామకృష్ణుడు! ..శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలు మస్తిష్కంలో మెదిలినపుడు -మహానటుడు ఎన్టీఆర్ ఒక్కరే గుర్తుకురావొచ్చు. కానీ, అలాంటి పాత్రలను తమదైన శైలిలో పోషించి మెప్పించిన నటులూ పాతతరాన్ని పరికించి చూస్తే అక్కడక్కడా మనకు కనిపిస్తారు. సాంఘిక చిత్రాలలో ప్రధాన పాత్రలలో నటిస్తూ పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో దొరికిన అవకాశాలను వినియోగించుకుని రాణించిన వాళ్లలో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కృష్ణుడు కూడా తక్కువేమీ కాదు. నిజానికి ఇలాంటి పాత్రలు పోషించాలంటే ఆహార్యం ఒక్కటే సరిపోదు, అంతకుమించి అనుభవం, నటనా ప్రతిభను కూడా జతచేయాలి. పౌరాణిక, జానపద పాత్రలు పోషించడంలో నందమూరి తారకరామారావు, కాంతారావు తరువాత హరనాథ్‌ను విభిన్న పాత్రల్లో తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. నిత్యకళ్యాణం పచ్చతోరణం చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన రామక్రిష్ణ తర్వాత కాలంలో కథానాయకుడిగా వైవిధ్యమైన పాత్రలను పోషించడమే కాదు, అనేక పౌరాణిక పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పించారు, విజయం సాధించగలిగారు. కాని నిజ జీవితంలో కాన్సర్ వ్యాధిని మాత్రం జయించలేక చిన్న వయసులోనే అభిమానులకు దూరమయ్యాడు. శ్రీకృష్ణుడి పాత్రలో నటిస్తూ విరామ సమయంలో పేపర్లోని వార్తలను ఆసక్తిగా చూస్తున్న సమయంలో తీసుకొన్న అరుదైన చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717