Others
నానీలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 5 March 2018
- డా. భీంపల్లి శ్రీకాంత్ 9032844017

ఎన్నాళ్లనీ
మనసులో దాచుకుంటావు
జ్ఞాపకాలు
నెమలీకలు
అందరూ చదివింది
పేదరికంలోనే
వెలిగింది మాత్రం
ఉన్నతోద్యోగంలో
తొందరపాటు
మన గ్రహపాటు
సాలోచనతోనే
అన్నీ సత్ఫలితాలు
ఆమెతో
మనసంతా విప్పాను
అంతే
ఏకతాస్వరం వినిపించింది
మాతృత్వం
మధురమైనది
జీవితాంతం
మరిచిపోలేనిది
నిత్యం సమస్యల
సుడిగుండంలో నేను
దుఃఖమే
నన్ను సాంత్వన పరిచేది
జీవితాన్ని
రాపిడి పట్టాను
కవిత్వంలో
తొంగిచూస్తూనే ఉంది