Others
చెప్పేసి పో
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 5 March 2018
- బులుసు సరోజినీ దేవి, 9866190548

కన్ను నాదే
చూపు మాత్రం దిగంతాల కావల
ఆకాశం మబ్బులతో నిండిపోయ
దట్టంగా నల్లగా అనిపిస్తోంది
దాని వర్ణం నలుపు కాదు
మబ్బులతో నేనూ
కదలి వెళ్ళిపోతున్నట్టు ఉంది
అవెటు వెళ్తే నా కళ్లటు
నక్షత్ర మండలాలు
వేలకొలది తారలు
ఆవగింజంత సూర్యమండలం
కనిపించని భూమి
సబ్బు నురగలో ఉండే బుడగ
ఏనుగు కాలిమీద ఈగ
బిందువంత జీవితం
అణువంత నేను
బ్రహ్మాండమంత నువ్వు
ఎలా?
చెప్పేసి పో... పోనీ
దయతో...