Others

అభ్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలు పొంగుతున్నపుడు నీళ్లు చల్లి అణచినట్లు అభ్యాసం చేస్తుంటే కొంత కాలానికి అహంకారమనే మంటను ఆపివేసే శక్తి కలుగుతుంది. అప్పుడు ధ్యానం నిరాటంకంగా కొనసాగుతుంది. రాకూడని ఆలోచనలు వచ్చి ఆటంకం కలిగినప్పుడల్లా అహంకారంమీద దైవానికి ఫిర్యాదుచేసి రక్షించమని ప్రార్థించాలి. ధ్యానం కొనసాగిస్తూనే వుండాలి. ఇదొక అభ్యాస విద్య. వదలకూడదు.ఇట్లా చేస్తూ ఉంటే కొన్నిరోజులకు ఏకాగ్రత తప్పకుండా సాధించగలుగుతారు. ధ్యానంవల్ల శరీరంలోని జీవ ప్రక్రియలు సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి. కొంతకాలానికి మీరే సమయపాలన చేసుకుంటారు. ధ్యానం తర్వాత వీలుంటే ఒక పుష్పమో ఫలమో దేవునికి సమర్పించండి. అరుణోదయాన్ని, అద్భుత ప్రకృతిని తిలకిస్తూ ఉదయించిన సూర్యునికి నమస్కరించండి.