Others

అద్భుత నిర్మాణం! (అనగనగా..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బయాలజీ క్లాస్‌లో టీచర్ మానవదేహం మీనియేచర్ మోడల్‌ని చూపించి చెప్పాడు.
‘‘ఇది గుండె. గుప్పెడు ఉండే ఇది రోజుకి ఏడువేల లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తూ శుద్ధి చేస్తుందని తెలుసా?’’
మిగతా విద్యార్థులతో పాటు భాస్వంత్ కూడా దానివైపు ఆశ్యర్యంగా చూసి చెప్పాడు.
‘‘వావ్. మా కార్లో ఓసారి నలభై రెండు లీటర్లే పడుతుంది!’’
‘‘పుట్టినప్పటి నుంచి ఇది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. మానవ నేత్రాలు ఏడు ఎముకలతో రక్షింపబడుతున్నాయి. కనురెప్పలు, కనుబొమలు వాటిని దుమ్ము, చెమట నుంచి కాపాడుతాయి. మనం కనురెప్పలు ఆర్పినప్పుడల్లా ఓ ప్రత్యేకమైన ద్రవం కళ్లని శుద్ధి చేస్తుంది.’’
విద్యార్థులంతా వాటి వంక ఆసక్తిగా చూసారు.
‘‘నాకు ఇది తెలీదు.’’ ఓ విద్యార్థి చెప్పాడు.
‘‘అరచేతుల్ని చూసారా? అవి జారిపోకుండా ఏదైనా పట్టుకునేలా వాటి చర్మం మీద గీతలు ఉన్నాయి. అవే వేలిముద్రలు. ఇవి కూడా ఓ మనిషికి, మరో మనిషికి ఒకేలా ఉండవు. మీ వేళ్లు రాయడానికి, బొమ్మలు గీయడానికి, వీణ వాయించడానికి, సుత్తితో కొట్టడానికి ఉపయోగిస్తాయి.’’
‘‘అవును బాస్కెట్ బాల్‌ని విసరడానికి కూడా’’ భాస్వంత్ చెప్పాడు.
‘‘బొటన వేలు మధ్య వేలు పక్కన ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంత పెద్ద శరీరాన్ని కేవలం చిన్న పాదాలే మోస్తున్నాయి. పెన్సిల్‌ని ములుకు మీద నించోపెట్టలేం కాని ఇంత పెద్ద శరీరాన్ని మునివేళ్ల మీద నించోపెట్టగలం. మానవ శరీర నిర్మాణం ఇలా ఎంతో అద్భుతమైంది. అవునా?’’
‘‘అవును.’’ విద్యార్థులంతా ఒప్పుకున్నారు.
‘‘కాని తరచు మనం ఇంత గొప్ప దేహాన్ని అగౌరవంగా చూస్తుంటాం. దీని మీద జోకులు వేసి అవమానిస్తాం. దీన్ని మనం ఎంతో గౌరవంగా చూడాలి. సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయి కాబట్టి వాటిని అవమానించినట్లు. ఆల్కహాల్ తాగితే లివర్ పాడవుతుంది కాబట్టి దాన్ని అవమానించినట్లు. టీవీ చూస్తూ తక్కువ నిద్రపోయి శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోయినా దాన్ని అగౌరవపరిచినట్లే. మీలో ఎందరు రోజూ రెండు పూట్లా స్నాం చేస్తారు?’’
కొందరే చేతులు ఎత్తారు.
‘‘నిత్యం శరీరాన్ని శుభ్రం చేయకపోతే దాన్ని మనం గౌరవించనట్లే. కాబట్టి ఇంత అద్భుతమైన ఇంజనీరింగ్ నిర్మాణంతో చేసిన ఈ శరీరాన్ని మనం ఎలా చూసుకోవాలి?’’
‘‘బాగా చూసుకోవాలి’’ పిల్లలంతా ముక్తకంఠంతో చెప్పారు.
ఇంటికి వచ్చాక భాస్వంత్ తల్లితో చెప్పాడు.
‘‘ఇక నుంచి రాత్రి టీవీ చూడకుండా నువ్వు చెప్పినప్పుడే నిద్ర పోతాను. నువ్వు చెప్పగానే స్నానం చేస్తాను’’.

మల్లాది వేంకట కృష్ణమూర్తి