Others

నిదానం ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యుగంలో ఒకర్ని చూసి మరొకరు అందని ‘ద్రాక్ష’ కోసం ఎగురుతూ, ఇంకా సాధ్యం కాకుంటే నైతిక విలువలను కాలరాసి, తమ పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. ఈ ‘పరుగు’ ధర్మానికి విరుద్ధమన్న విషయాన్ని పక్కన పెడుతున్నారు. దీనివల్లనే జీవితానికి తెలియని ‘అసంతృప్తి’ అనే ముప్పు పుట్టుకొస్తుంది.చికాకులు పరాకులు వస్తున్నాయ. ఒకరంటే మరొకరికి కోపం, పరిస్థితుల పట్ల అసహనం ఎక్కువ అవుతున్నాయ. అందుకే నిలబడి నీళ్లు తాగినా ఫర్వాలేదు కాని పరుగెత్తి పాలు తాగవద్దు అన్నారు పెద్దలు. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి చూడండి. మీకే మీరు న్యాయనిర్ణేతలు ఉండండి. మీరు చేసే పరుగెత్తే పనుల వల్ల ఏమి సాధిస్తున్నారో ఆలోచించండి. పరుగు అంత మంచిది కాదు నిదానం ప్రధానం అన్నారు.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003