Others

దుష్టత్వాన్ని దునిమే నంద నందుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యో నాకోసం ఇంత తపించే నావారిని నేను ఇబ్బందులకు గురిచేయడం ఏం బాగుందిఅనుకొన్నాడు. వెంటనే ఒక్కసారిగా తన దేహాన్ని పెంచాడు. అప్పటిదాకా అంతా నా ప్రతాపం అనుకొన్న కాళీయుడు విచిలితుడయ్యాడు. ఇదేమిటి ఇట్లా అవుతోందే అనుకొన్నాడు. తృటి కాలంలో కృష్ణుని దేహం కాళీయుని చీల్చుకుని పైకి వచ్చింది. ఆ దెబ్బకే కాళీయునిలో బలహీనత ఆవరించింది. ఆపై కృష్ణుని కాళీయుని పడగలపై నిల్చున్నాడు. వాని వంద పడగలూ ఆయన రంగస్థలంలా భాసించాయి. తాండవ కృష్ణుడయ్యాడు. అందరినీ ఆశ్చర్యపరిచే నృత్యం చేస్తున్నాడు. ఆ కృష్ణయ్య నృత్యాన్ని చూడడానికి దేవతలు దిగి వచ్చారు. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కినె్నరలూ , కింపురుషులూ కూడా చూడడానికి వచ్చారు. వారంతా కృష్ణుడు చేసే నృత్యాన్ని అబ్బురంగా చూస్తున్నారు.
అప్పటిదాకా కృష్ణున్ని రక్షించమని వేడుకున్న గోపజనం ఉన్నట్టుండి అక్కడ జరిగేది చూశారు. కృష్ణుడు నాట్యం చూశారు. వారికి ఆశ్చర్య ఆనందాలు కలిగాయి. వెంటనే వారుకూడా ఆ నాట్యం చేయసాగారు. తగిన శాస్తి కుదిరింది కాళీయునికి అనుకొన్నారు. కృష్ణుని లాగే నృత్యాలుచేయడం ఆరంభించారు.
కాళీయునికి పడగలపైన 14 భువన బోంతరాలను తన కుక్షిలో పెట్టుకున్న కృష్ణయ్య బరువు భరించలేకపోయాడు. అతని కడుపులోని ప్రేవులన్నీ గజగజ వణుకుతున్నాయి. అతని దేహంలో ఎంతో కాలంలో పెరుగుతున్న విషం అంతా నోటి నుంచి ముక్కుల నుంచి ఎగచిమ్ముకొస్తోంది. నోటి నుంచి విషమంతా జారిపోయింది. నెత్తురు కక్కుకుంటున్నాడు. కాళీయునిలో శక్తి అంతా దిగిపోయింది. ప్రాణాలు కడకట్టిపోయాయి. దానితో ఇతను సామాన్య బాలుడు కాడు ఆ దేవదేవుడైన మహావిష్ణువే నా మదం అణచడానికి దిగి వచ్చాడని అనుకొన్నాడు.
బలహీనమవుతున్న కాళీయుని గురించి కాళీయుని భార్యలు తెలుసుకొన్నారు.తమ భర్త బాధ వారికి అర్థమయింది. వారు పరుగెత్తుకు వచ్చారు. వారి పరుగులాటలో బాధలో వారి కొప్పులు వీడి పోయాయి. వారు ధరించిన వస్త్రాలు చెదిరిపోయాయి. వారి చేతుల్లో ఉన్న పిల్లలను పట్టుకొని దేవాదిదేవుని దగ్గరకు పరుగెత్తుకు వచ్చేసారు. వారంతా ఒక్కసారిగా కృష్ణ దర్శనం చేసుకొన్నారు. వారికి ఎంతో ఆనందమూ దుఃఖమూ కలిగాయి. వారంతా కృష్ణస్వామికి చేతులెత్తి నమస్కరించారు
అనుకోకుండా వారి నోళ్లు కృష్ణనామాన్ని స్మరిస్తున్నాయ. చేతులు ఆ స్వామికి నమస్కరిస్తున్నాయ. దేవాదిదేవా మమ్ము కరుణించుస్వామి. కాళీయునికి భార్యలమైన మమ్ముల్ను రక్షించాల్సిన బాధ్యత కూడా నీదేసుమా అని అంటున్న వారిపై స్వామి కృపారసాన్ని కురిపించాడు. వారు ఆనంద చిత్తులయ్యారు. స్వామి అన్నింటికీ కారణాకారుడవు నీవే నని పదేపదే వేడుకుంటున్నారు. తమను కాపాడమని చెబుతున్నారు. *

చరణ శ్రీ