Others

నామజపంతో ముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేహము, ఆత్మ వేరు వేరు. చేసిన కర్మల వల్ల ఈ దేహము ప్రాప్తవౌతుంది కాని దేహము ఆత్మ ఒక్కటి కాదు. మానవుడు పాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లుగా చేసిన కర్మల ఫలితాన్ని బట్టి ఆత్మ ఇపుడున్న దేహాన్ని విడిచి మరొక దేహాన్ని పొందుతుంది. కాని ఆత్మ చావదు పుట్టదు. అసలు ఆత్మకు చావు పుట్టకలు లేవు. ఆత్మ దేహము కాదు. దేహమందు దేహి ఒకడు కలడు. అతనికి కౌమార, యవ్వన జరలవలనే మరొక దేహము కూడ ప్రాప్తమగును. అతడు ఎన్నడును పుట్టడు, చావడు, ఉండి లేకుండా పోడు. అతడు నిత్యుడు, శాశ్వితుడు, చంపబడడు అని తత్వాన్ని అర్జునునికి స్వయంగా భగవానుడు చెప్పాడు.
కనుక నీవు ఎవరినో చంపుతున్నానని కాని వారెవరో మరణిస్తున్నారని కాని విచారించవలసిన పని లేదు. నీ గుణ కర్మలను బట్టి ఈ దేహము వస్తుంది. ఆ యా కర్మల తాలూకూ ఫలితంవల్లనే ప్రాప్తించిన జన్మలోని దేహాన్ని పొందుతారు అని జ్ఞానోపదేశం చేశాడు. అదే గీతాసారం. ఇపుడు కలియుగంలో కూడా మనం చేసే పనులనుబట్టే మనకు జన్మలు సిద్ధవౌతాయ. చేసిన మంచిచెడులవల్లే సుఖదుఃఖాలు కలుగుతాయ. కనుక చేసేపని ధఠ్మయుతమైతే అంతటా సుఖమే కలుగుతుంది. భగవంతుని సన్నిధి యందే ఉండాలని అనుకొంటే కేవలం సన్నిధి మాత్రమే సుఖాన్నివ్వదు. భగవంతుడు నీకు ఉద్దేశించిన కర్తవ్యాన్ని ప్రతి ఫలాపేక్ష లేకుండా చేసిన నాడు అంతా భగవంతుడే నాచేత చేయస్తున్నాడన్న నమ్మకం కలిగిన నాడు ఆ కర్మల తాలూకూ ఫలితాలు నీకు అంటవు అనే జ్ఞానా మృతాన్ని కూడా అందించాడు. కనుక మీమాంసల జోలికి పోకుండా పని చేయ పరమాత్మ నామాన్ని జపించు...

- హనుమాయమ్మ