Others

సుమధుర రామాయణం.. (బాలకాండం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

85. గురు జనంబులు మంత్రులు వౌని వరులు
అందరాసీనులై యుండ రామచంద్రు
పాదముల చెంత గూర్చుండి భక్తి వినయ
ములతొ భరతుడు అన్నతో బల్కెనిట్లు

86. అన్న! శమియింపు మన్న నన్ గన్న తల్లి
మూఢ చిత్తమై చనటి కార్యంబొనర్చె
అగ్రజుండవు నీవుండ పిన్న వాడు
రాజ్యమేలుట ధర్మమే? రామచంద్ర!

87. స్ర్తివశీభూతుడై భ్రాంత చిత్తుడౌచు
తండ్రి బల్కిన పలుకులే సత్యములని
తలపనేల పైత్రుకమగు రాజ్యమునకు
అగ్రజుడ వభిషుక్తుండ వగుము రామ

88. అనుచు బల్కి భరతుడు
శ్రీరామచంద్రు
పాదముల నంటి భక్తితో
వేడుకొనియె
రామచంద్రుడు ప్రేమతో
తమ్ము జూచి
తండ్రి వాక్యమాదరణీయ
మనియె తమకు

89. మరియు పూర్వము తండ్రీ మీ మాతకిచ్చి
నట్టివరముల దలచి యనృతపు భీతి
సత్యవచన పాశమునకు బద్దుడైన
తండ్రి యట్లు సల్పెను కామవశత గాదు

90. తండ్రి సత్యము నెరవేర్చి తిరిగి వత్తు
అంత దనుక సింహాసన మధివసింపు
మనిన భరతుడు ప్రభుడవై అన్న! నీవు
రాజ్య మేలుము వనవాస మేనొనర్తు

91. అనిన భరతుని శ్రీరాము డనునయించి
నీకు రాజ్యాభిషేకము నాకు తండ్రి
శాంతవౌ వనరాజ్యము జేయనిచ్చె
తప్ప పితృవాక్యమనియెనా సత్యమూర్తి

92. దుఃఖపూరిత నేత్రుడై భరతుడు తన
చుట్టునున్నట్టి పెద్దల తోడ మీర
లైన రాము నయోధ్యకు రమ్మటంచు
జెప్పు డని వేడ విచలితులైరి వారు

93. విను కుమార రాముడు పితృ వాక్యపాల
నమ్మున స్థిర నిష్టతో నున్నవాడు
రామసంకల్పము మరల్చ సాధ్యపడదు
ఎవ్వరికి నని బల్కిరి పెద్దలంత

94. ధర్మ పరిషత్తునకు రాము డాదరమున
అంజలి ఘటించి వనవాస మైన పిదప
వచ్చి భరతుని సాయము తోడ రాజ్య
పాలనము జేతు నని బల్కె రఘువరుండు

95. భరతు డంతట రాముని పాదములకు
భక్తి తోడుత మ్రొక్కి నీ పాదుకలను
కరుణ దయచేయు మయ్యనన్ కనికరించి
యివియె పాలించు కోసల ప్రజల నెల్ల

96. అనిన భరతుని విన్నప మాలకించి
కమలనయనుడు తన పాదుకల నొసంగె
పదియు నాల్గేడు లేగిన మరుదినమ్ము
నీవు దయ చేయకున్న నేనగ్ని జొత్తు
*

టంగుటూరి మహాలక్ష్మి