Others

భవ సంపద - భావ సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషిని భావదారిద్య్రం మరి భవ దారిద్య్రం ఈ రెండూ తీవ్ర వేదనకు గురిచేస్తాయి. భవ దారిద్య్రం ఉన్నా ఎలాగో ఓలాగ మనిషి కాపాడబడతాడు. అయితే భావదారిద్య్రం ఉంటే మాత్రం మనుషులు తీవ్ర వ్యాకులతకు గురవుతారు.
శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు కుచేలుడు - గంపెడు పిల్లలు, భార్య, సంసార సాగరాన్ని ఈదే సంపద లేక అనునిత్యం ‘్భవ దారిద్య్రం’తో ఉండేవాడు. కాని మనస్సులో ఎప్పుడూ దైవచింతన, జపం, తపం, ధ్యానం, మూడు పూటలా సంధ్యావందనం, ప్రశాంతవదనం, మధుర భాషణం, శ్రీకృష్ణుని స్నేహాన్ని సదా గుర్తు చేసుకుంటూ అమిత భావసంపదతో ఆత్మానందంలో ఉండేవాడు.
సంచిత, ప్రారబ్ద కర్మలు పూర్తయిన క్షణంలో శ్రీకృష్ణుని అనుగ్రహం కలిగి, తన భవదారిద్య్రాన్ని కూడా తొలగించుకుని, ముక్తి పొందిన మహనీయుడు సుధాముడు (కుచేలుడు).
ఇక భవ దారిద్య్రం లేక రాజాశ్రయం వల్ల అమిత సంపదలు (్భవ సంపదలు) పొంది వైభవంగా కీర్తి ప్రతిష్ఠలతో జీవించినవాడు శ్రీనాథుడు. ఎన్నో కావ్యాలు, వ్రాసి, రెడ్డిరాజుల ప్రాపకం పొంది విశిష్ఠ వైభవంగా కీర్తింపబడినవాడు. అయినా ఉన్న సంపదలతో తృప్తి చెందక, ఒకరోజు తర్వాత మరొక రాజును ఆశ్రయిస్తూ, అమిత వైభవంగా జీవిస్తూ ఉండేవాడు. చివరికి సంకెలలు పడ్డాయి. సంపదలన్నీ నశించిపోయాయి. అనారోగ్యంతో బాధపడి, అవమాన భారంతో కృశించి, తినడానికి తిండి కూడా లేక తీవ్ర వేదనతో మరణించాడు.
శ్రీనాథుని బావమరిది మహాకవి పోతన. అర ఎకరా పొలం ఉండేది ఆయనకు. దానినే సాగు చేసుకుని, ఉన్నంతలో అమిత సంతృప్తితో, ద్యానంతో భగవన్మామ స్మరణతో జీవితాన్ని కొనసాగించినవాడు. శ్రీరామచంద్రుని కూర్పు భక్తుడు. ధ్యానంలో శ్రీరాముడు ఇచ్చిన ఆదేశంతో కలలో శ్రీరామ దర్శనంతో శ్రీరాముని ఆదేశంపై ‘్భగవతం’ తెలుగులో అనువదించినవాడు. పోతన భాగవతం సుప్రసిద్ధం.
అతడికి ‘్భవ దారిద్య్రం - భావ దారిద్య్రం’ రెండూ లేవు. ‘్భవ సంతృప్తి - భావ సంపద’ రెండూ ఉన్నాయి. ఎంత భాగ్య జన్మం! చరితార్థం కదా! పోతన యొక్క అత్యంత నిరాడంబర జీవితం ఈ ప్రపంచంలో ఆదర్శం. అలాగే త్యాగరాజు ఇదే విధమైన జీవనం సాగించిన మరొక మహామహనీయ చరిత్రుడు - వాగ్గేయకారుడు.
‘పలికెడిది భాగవతమట - పలికించెడివాడు రామభద్రుండట’ అని నుడివి భాగవత అనువాద రచన మొదలుపెట్టినవాడు. ‘వ్రాయించేది రాముడు - వ్రాసేది ఆత్మారాముడు’ ఇదీ అతని ‘్భవన’. ఎంతటి అనన్య భావసంపద! ఎంత భాగ్యమో - ఎంత సౌఖ్యమో! దొరకునా ఇటువంటి సేవ!
భాగవతాన్ని రెడ్డిరాజుకు అంకితం ఇస్తే, అమిత సంపదలు, ఘన సన్మానం, వైభోగం, గండపేరుండం, రాజాస్థాన పదవి, జీవితకాల పోషణ దొరుకుతాయని పోతనను వష్టింపజూశాడు అతని బావ శ్రీనాథ కవిసార్వభౌముడు. కాని తాము ‘రాముడి వారమ’ని, శ్రీరామచంద్రునికి మాత్రమే ‘్భగవత కావ్యసంపద’ను అంకితమివ్వడం అనేది ఎప్పుడో నిర్ణయింపబడిన వాస్తవమని వినమ్రంగా, వినయంగా సమాధానం ఇచ్చి తన భాగవత కావ్య అనువాద రచనలో మునిగిపోయాడు పోతనామాత్యుడు.
పోతన గురించిన ఒక అద్భుత సంఘటన ప్రచారంలో ఉంది. అది వాస్తవమని కొందరు, కల్పన అని కొందరు చెపుతారు. అది ఒక మధుర మనోజ్ఞ మనోహర సంఘటన.
భాగవతాన్ని తెనిగిస్తున్నపుడు ఒకరోజు ఉదయం అతడి కలం ముందుకు సాగలేదు. ఎంత ప్రయత్నించినా ప్రేరణ రాక కలం ముందుకు పోలేదు. ఇక పాలుపోక శ్రీమతితో తాను పొలం వరకూ వెళ్లి వస్తానని బయటకు పోయాడు. ఆ తర్వాత కాస్సేపటికే తిరిగి వచ్చాడు. కూర్చుని ఒక పద్యాన్ని తెనిగించాడు. మరల లేచి బయటకు పోతూ ఉంటే అతని మహాసాధ్వి అయిన భార్య - స్వామీ! భోజనం తయారయింది. భోజన వేళ కూడా అయింది’ అని పీట వేసి అన్నం వడ్డించింది. భోజనానికి కూర్చున్న భర్త ప్రక్కనే కూర్చుని అలవాటు ప్రకారం వీవెనతో విసరింది. కొసరికొసరి వడ్డించింది. ఒక కూర, పచ్చడి, రసం, మజ్జిగ అన్నం. ఇంతే వారు నిత్యం భుజించే అతిసామాన్యమైన ఆహారం. అయినా ఆ రోజు అమిత తృప్తిగా భోజనం చేసి బయటకు వెళ్లిపోయాడు పోతనామాత్యుడు.
అలవాటు ప్రకారం భర్త భోజనం చేసిన తర్వాత, అదే విస్తరిలో భోజనం చేసి, ఆకు మడిచి బైట తొట్లో వేసి వచ్చింది ఆ సాధ్వీమణి. ఇంతలో మరల ‘పోతన’ బయట నుండి వచ్చి భోజనం వడ్డించమని అడిగాడు. చోద్యంగా చూసింది ఆ ఇల్లాలు.
-సశేషం

-మారం శివప్రసాద్.. 9618306173